For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేశ్ మూవీ నుంచి స్టార్ హీరోయిన్ ఔట్: సమంతతో డైరెక్టర్ సీక్రెట్ మీటింగ్.. అసలేం జరిగిందంటే!

  |

  టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న బడా హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. సీనియర్ హీరో కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆరంభంలోనే తన టాలెంట్లతో సత్తాను నిరూపించుకున్నాడు. తద్వారా చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ స్టార్ హీరో.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

  ఇక, ఈ మధ్య కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు.. ఒకటి పట్టాలపై ఉండగానే మరో ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడి సినిమా నుంచి ఓ స్టార్ హీరోయిన్ తప్పుకుందని తెలుస్తోంది. దీంతో దర్శకుడు సమంతతో చర్చలు జరిపాడట. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  హ్యాట్రిక్ హిట్లతో దూకుడు మీద మహేశ్

  హ్యాట్రిక్ హిట్లతో దూకుడు మీద మహేశ్

  కొంత కాలంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేసిన 'భరత్ అనే నేను'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే వంశీ పైడిపల్లి రూపొందించిన 'మహర్షి', యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసిన 'సరిలేరు నీకెవ్వరు'తో వరుసగా మూడు విజయాలను అందుకుని హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్నాడు.

  మళ్లీ రెచ్చిపోయిన అషు రెడ్డి: ఎద అందాలు మొత్తం కనిపించేలా.. వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకుంటారా!

  సర్కారు వారి పాట పాడుతోన్న మహేశ్

  సర్కారు వారి పాట పాడుతోన్న మహేశ్

  ఫుల్ జోష్‌లో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే.

  మాటల మాంత్రికుడితో మహేశ్ మూవీ

  మాటల మాంత్రికుడితో మహేశ్ మూవీ

  'సర్కారు వారి పాట' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే మహేశ్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్ల కాంబోలో సినిమా రాబోతుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దీనికి కూడా థమనే మ్యూజిక్ డైరెక్టర్.

  హాట్ షోతో హీటు పెంచేసిన అనుపమ పరమేశ్వరన్: అమాంతం పైకి లేపి రచ్చ చేసిన హీరోయిన్

   అన్నీ పూర్తి చేసి రెడీ.. అప్పటి నుంచే

  అన్నీ పూర్తి చేసి రెడీ.. అప్పటి నుంచే

  'అతడు', 'ఖలేజా' వంటి చిత్రాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జత కట్టాడు మహేశ్ బాబు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ కోసం త్రివిక్రమ్ ఇప్పటికే ఫుల్ స్క్రిప్టును రెడీ చేసేశాడట. అంతేకాదు, దీనికి డైలాగ్ వెర్షన్‌ను కూడా కంప్లీట్ చేశాడట. దీన్ని జనవరిలో మొదలు పెడతారట.

  ఇద్దరు హీరోయిన్లు.. ఒకరు ఫిక్స్ అవగా

  ఇద్దరు హీరోయిన్లు.. ఒకరు ఫిక్స్ అవగా

  క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అంతేకాదు, ఇందులో ఇంకో హీరోయిన్ కూడా కీలక పాత్ర చేయనుందని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే నభా నటేష్, లావణ్య త్రిపాఠి సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.

  హాట్ ఫొటోలు షేర్ చేసిన సమంత: విడాకుల తర్వాత తొలిసారి ఘాటుగా.. అసలిలా ఎప్పుడూ చూసుండరు

  మహేశ్ మూవీ నుంచి హీరోయిన్ ఔట్

  మహేశ్ మూవీ నుంచి హీరోయిన్ ఔట్

  తాజా సమాచారం ప్రకారం.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా నుంచి బుట్టబొమ్మ పూజా హెగ్డే తప్పుకుందట. ఇప్పటికే ఆమె తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలను ఒప్పుకుంది. దీంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకే ఈ సినిమా నుంచి తప్పుకుందని అంటున్నారు. మరోవైపు.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే దూరమైందన్న టాక్ కూడా వినిపిస్తోంది.

  Tollywood స్టార్ హీరోలకు షాక్, AP లో No Benefit Shows | AP Govt || Filmibeat Telugu
  స్టార్ హీరోయిన్‌తో చర్చలు... లైన్‌లోకి

  స్టార్ హీరోయిన్‌తో చర్చలు... లైన్‌లోకి

  మహేశ్ బాబు సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందన్న వార్తలు వచ్చిన వెంటనే.. ఆమె స్థానంలోకి మరో హీరోయిన్ వచ్చిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుందట. ఇప్పటికే త్రివిక్రమ్ ఆమెతో చర్చలు జరపగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. మహేశ్‌తో సామ్ ఇప్పటికే పలు చిత్రాల్లో కలిసి నటించింది.

  English summary
  Mahesh Babu recently Announced his 28 film with Trivikram Srinivas. Now Samantha Ruth Prabhu Replace Pooja Hegde for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X