షాకింగ్ : చైతూపై కోపంతో రెండో పెళ్లికి సిద్ధమైన సమంత! - పెళ్లి కొడుకు ఎవరంటే?
గత కొద్ది కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన హీరోయిన్ సమంత పర్సనల్ లైఫ్‌లో ఎంజాయ్ చేస్తూ గడుపుతుంది. ఈ మధ్యే మళ్లీ తన సినిమా పనులను చూసుకుంటోంది. అయితే ఈ సమయంలో సమంత రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలిసింది! దాని గురించే ఈ కథనం..
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య - సమంత పెళ్లైన నాలుగేళ్లకే డివొర్స్ తీసుకుని అందర్ని షాక్‌కు గురి చేశారు. విడాకులు తీసుకున్నాక ఎవరి జీవితం వారు గడుపుతున్నప్పటికీ వారి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతూనే ఉంటుంది. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారనో, లేదా మరో పెళ్లి చేసుకోబోతున్నారనో.. ఇలా ఏదో ఒక గాసిప్ బయటకు రావడం అది చర్చనీయాంశంగా మారడం జరుగుతూనే ఉంటోంది.

అయితే ప్రస్తుతం నాగచైతన్య - సమంత ప్రొఫెషనల్ లైఫ్‌తోనే బిజీగా ఉన్నారు. వరుస ఫ్లాఫ్లను ఎదుర్కొంటున్న చైతూ ఈ మధ్యే దూత వెబ్‌సిరీస్‌తో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కాడు. కానీ థియేటర్లో మాత్రం ఇంకా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం తండేల్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక సమంత విషయానికొస్తే చివరిగా ఖుషితో పలకరించిన ఈమె కొంత కాలం నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. రీసెంట్‌గానే మళ్లీ సిటాడెల్ ఇండియన్ వెబ్‌సిరీస్ డబ్బింగ్ వర్క్‌తో మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టింది.
అయితే ఇదంతా మంచిగా సాగుతున్న సమయంలో మళ్లీ సడెన్‌గా సమంత పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. సామ్ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ బయట కథనాలు తారసపడుతున్నాయి. నాగచైతన్య మీద కోపంతోనే ఈ పని చేస్తున్నట్లు ఆ కథనాల్లో రాసి ఉంది. కానీ వరుడు ఎవరు అనేది తెలీదు కానీ ప్రస్తుతం ఈ వార్త బయట వైరల్ అవుతోంది. ఈ వార్త చూసిన అభిమానులు కొంతమంది షాక్ అవుతుంటే మరికొంతమంది ఇదంతా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా సామ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు, వరుడు అతడే అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో హల్ చేశాయి. కాబట్టి తాజాగా మళ్లీ వార్తలు వస్తున్న దాంట్లో నిజమెంతో తెలియాలంటే మరి కొంత కాలం వేచి ఉండాల్సిందే..

రెండో పెళ్లిపై సమంత కామెంట్స్ : గతేడాది డిసెంబర్ చివర్లో హీరోయిన్ సమంత రెండో పెళ్లిపై స్పందించింది. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రెండో పెళ్లి అనేది బ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్ అని, తొలిసారి పెళ్లి చేసుకున్న వారి కన్నా రెండో, మూడో సారి పెళ్లి చేసుకున్న వారే ఎక్కువగా విడిపోతున్నారని పేర్కొంది. కాబట్టి దీని బట్టి చూస్తే సామ్ ఇప్పట్లో రెండో పెళ్లి చేసుకునే అవకాశం కనపడట్లేదు. కానీ సమంత పెళ్లికి రెడీ అయినట్లు బయట కథనాలు రాస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..


Click it and Unblock the Notifications











