ఆమ్మో ఇంటికి వెళ్ళను అంటున్న సమంత.. అక్కడే ఉంటానంటూ మకాం. అసలు విషయమేమిటంటే?
విడాకులు తీసుకున్న తర్వాత ఆ బాధ మరిచిపోవడానికి ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో చాలా బిజీగా గడిపేస్తోంది. ఒకటి తర్వాత మరొకటి పాన్ ఇండియా సినిమాలు సైన్ చేస్తూ.. టాప్ హీరోయిన్‌గా అత్యధిక రెమ్యునరేషన్స్ అందుకుంటోంది. అందుకే సమంతకు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అయితే ఇప్పటికే చైతూకు సంబంధించిన అన్ని వస్తువులు తిరిగి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు సమంతకు తన ఇంట్లో ఉండటం కంటే మరో చోట ఉండడం నచ్చుతుందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే

మూవీ సెట్స్‌లో
వరుస సినిమాలు చేస్తున్న సమంత ఇటీవల సమంత తన అప్‌కమింగ్ సినిమా 'శాకుంతలం' షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా షూటింగ్ పూర్తవడంతో శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఇక ప్రస్తుతానికి సమంత 'యశోద' మూవీ సెట్స్‌లో అడుగుపెట్టింది.

లేడీ సెంట్రిక్
ఇటీవల ఈ మూవీ టీమ్‌తో సామ్ పార్టీ చేసుకున్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ద్విభాషా చిత్రం ‘యశోద' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ జరుగుతోంది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ సారథ్యంలో సమంతపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని టాక్. గత కొన్నేళ్లుగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ఎక్కువగా లేడీ సెంట్రిక్ సినిమాలకు, కథాంశాలతో ప్రయోగాలకు ప్రాధాన్యతనిస్తోంది.

బాగా నచ్చేసి
ఫ్యామిలీమ్యాన్-2 వెబ్ సిరీస్ తో పాటు ఓ బేబీ, సూపర్ డీలక్స్ లాంటి సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ లో కనిపించి మెప్పించింది. ఇక యశోద సినిమా కోసం రూ. 5 కోట్లు ఖర్చుపెట్టి హోటల్ సెట్ వేయించిన సంగతి తెలిసిందే. ఈ సెట్ కోసం ఆర్ట్ డైరెక్టర్ మూడు నెలలు పాటు కష్టపడ్డాడు. 200 మంది ఈ సెట్ నిర్మాణంలో పాల్గొన్నట్లు సమాచారం. అయితే సమంతకు ఈ హోటల్ సెట్ బాగా నచ్చేసింది.

ఇక్కడే ఉండి
అందుకే కొన్నాళ్లు ఇంటికి దూరంగా అక్కడే ఉండిపోతే బాగుండు అని అంటోంది. ఇంటికి రోజు వెళ్లి రావడం కంటే ఇక్కడే ఉండి సినిమా షూటింగ్ కు హాజరవుతానని చెప్పిందట. హరి- హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘యశోద'లో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Recommended Video


సినిమాల విషయానికి వస్తే
ప్రస్తుతం ఈమె తెలుగులో ‘శాకుంతలం', ‘యశోద' సినిమాలతో పాటు తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ‘కతువాకుల రెండు కదల్' సినిమాలో నటిస్తుంది. అది కాకుండా సమంత తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన దసరా సందర్భంగా తాజాగా విడుదలైంది.
కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్ డైరెక్షన్‌లో సమంత ఈ చిత్రాన్ని చేయనున్నారు. ప్రొడక్షన్ నెం.30 అనే వర్కింగ్ టైటిల్‌తో దసరా సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.


Click it and Unblock the Notifications











