Pushpa లెక్కలు వేరే.. మాస్ నంబర్ కోసం రంగంలోకి సమంత.. సుక్కూ ప్లాన్ మామూలుగా లేదే!
ఒక్కసారి బయటకు వచ్చే వార్తలు నమ్మాలో లేదో కూడా అర్థం కాని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి ఒక పుకారు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అదేంటంటే సమంత ఇప్పుడు పుష్ప సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేస్తోందని అంటున్నారు.. ఆ వివరాల్లోకి వెళితే

ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'పుష్ప'. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబందించిన ఓ పాటను ప్రస్తుతం చిత్రీకరిస్తుండగా ఇంకొక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఐటెం సాంగ్ అని అంటున్నారు. మామూలుగానే సుకుమార్ ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్, లక్ష ఖర్చయినా పర్లేదు సాంగ్ లక్షణంగా రావాలనే టైప్.

స్టార్ హీరోయిన్
ఈ సినిమాలో ఐటెం సాంగ్ ను కూడా ఎంతో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఈ పాటలో ఓ స్టార్ హీరోయిన్ కనిపించబోతుందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అప్పటి నుంచి ఈ విషయంలో క్లారిటీ రాలేదు. పూజా హెగ్డే, తమన్నా లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఆ తరువాత ఒక హిందీ లీడింగ్ హీరోయిన్ అన్నారు కానీ ఇప్పుడు సుకుమార్ ఏకంగా సమంతను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

అందుకే అలా
రంగస్థలం సినిమా సమయం నుంచి కూడా సుకుమార్ కి, సమంతకు మధ్య మంచి రిలేషన్ ఉంది. అందుకే తన సినిమాలో ఐటెం సాంగ్ లో నటించమని సుకుమార్ అడగడంతో ఆయన కాదనలేక పోయారట. ఆయన మీద ఉన్న గౌరవంతో పాటు భర్త ఎడబాటుతో సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుకుమార్ చివరి సినిమా 'రంగస్థలం'లో పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ సూపర్ హిట్ అవడంతో ఈ సారి సమంతను తీసుకొస్తున్నారట సుకుమార్.

మాస్ నంబర్
ఈ పాటలో బన్నీతో కలిసి సమంత మాస్ స్టెప్పులు వేయబోతుందని అంటున్నారు. సినిమాకి ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని , నవంబర్ మూడో వారం నుంచి హైదరాబాద్ లో ఈ పాటను షూట్ చేస్తారని అంటున్నారు. అయితే ఎడబాటు కారణంగా దాన్ని మరచిపోఏందుకు ప్రస్తుతం సమంత చాలా బిజీగా గడుపుతోంది. ఇలాంటి సమయంలో ఆమె ఐటెం సాంగ్ ఒప్పుకోవడం అనేది కాస్త కటవు అయిన నిర్ణయమే అని చెప్పాలో.
Recommended Video

సినిమాల విషయానికి వస్తే
ఇటీవల 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసిన సమంత రూత్ ప్రభు తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తుంది. అలానే శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెలుగులో ఓ సినిమా చేయబోతుందని అంటున్నారు.ఇవి కాక
మరో బైలింగ్యువల్ సినిమా ఒప్పుకుంది. ఓ బాలీవుడ్ సినిమాను కూడా లైన్ లో పెట్టిందని సమాచారం. తాప్సీ సొంత బ్యానర్ లో సమంత నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది కానీ త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందనీ అంటున్నారు.


Click it and Unblock the Notifications











