వరుస బాలీవుడ్ సినిమాలు లైన్లో పెడుతున్న సమంత.. సక్సెస్ ఫుల్ కాంబోలో హీరోయిన్ గా ఎంపిక?
హీరోయిన్ సమంత ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆమె ఎక్కువగా ఒకపక్క హైదరాబాద్ తో పాటు మరోపక్క ముంబైలో కూడా కనిపిస్తూ ఉండడంతో ఆమె బాలీవుడ్ మీద దృష్టి పెట్టినట్లు అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆమె ఒక సినిమా ఒప్పుకుందంటూ ప్రచారం జరుగుతుండగా తాజాగా మరో సినిమా కూడా ఫైనలైజ్ చేసిందంటూ ప్రచారం మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే..

తమిళ సినిమాల్లో కూడా
నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత సినిమాల విషయంలో దూసుకుపోతోంది. ఒకపక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరో పక్క తమిళ్ సినిమాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె చేసిన శాకుంతలం, యశోద వంటి సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా ఆమె ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే కొన్ని తమిళ సినిమాల్లో కూడా ఆమె భాగమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పుష్ప ఐటమ్ సాంగ్
ఇక ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత పుష్పలో చేసిన ఐటమ్ సాంగ్ ద్వారా నార్త్ లో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ముంబైలో నివాసం ఉంటున్న సమంత బాలీవుడ్ సినిమాలు ఫైనలైజ్ చేసే పనిలో ఉందని ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఆయుష్మాన్ ఖురానా హీరోగా చేసి సినిమాలో ఆమె హీరోయిన్గా ఎంపికైనట్లు ప్రచారం జరిగింది.

ది ఇమ్మార్టెల్ అశ్వద్ధామ
దినేష్ విజన్ నిర్మాణంలో రూపొందబోయే సినిమాలో ఆమె లీడ్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇక ఆ వార్త ఇంకా ఫైనలైజ్ కాకముందే ఆమె ఉరి దర్శకుడు ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కే ది ఇమ్మార్టెల్ అశ్వద్ధామ అనే సినిమాలో లీడ్ పాత్రకు ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ సరసన ఆమె హీరోయిన్గా నటించే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే
నిజానికి ఆ సినిమాలో సారా అలీఖాన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా సమంత పేరు తెర మీదకు వచ్చింది. నిజంగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో తెలియదు కానీ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. ఇక సమంత ఇంటర్నేషనల్ ఫిలిం ద్వారా ప్రపంచ దేశాల ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
Recommended Video


కేజీఎఫ్ సినిమాలో లా
ఇక ఆమె కరణ్ జోహార్ షో లో విడాకుల గురించి, పెళ్లి గురించి కామెంట్లు చేసినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా సారమైన ఒక ప్రోమో కూడా ఆసక్తికరంగా మారింది. ఆ ప్రోమోలో కరణ్ జోహార్ ఏమి అడిగారో తెలియదు కానీ ప్రస్తుతం బాధతో కూడుకున్న పెళ్లి సంబంధాలన్నింటికీ నువ్వే కారణం అని చెబుతూ తర్వాత అందరూ పెళ్లి జీవితం అంటే కబీ ఖుషి కభీ ఘం సినిమాలో లాగా ఉంఉంటుందని అనుకుంటే అది కేజీఎఫ్ సినిమాలో లాగా తయారయింది అంటూ ఆమె కామెంట్లు చేసింది.


Click it and Unblock the Notifications











