Who Is Preetham Jukalker? అపరిచిత వ్యక్తితో సమంత.. మరోసారి మీడియాలో రూమర్లు
దక్షిణాదిలో అగ్రతార సమంత రుత్ ప్రభు మరోసారి కలియుగ వైకుంఠ పుణ్యక్షేత్రం తిరుమలలో పర్యటించారు. ఆమె భక్తిశ్రద్దలతో తిరుచనూరులోని పద్మావతి అమ్మవారిని, తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు. అయితే ఆమె తిరుమల రాకతో మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారారు. అయితే ఆమె వెంట మరో అపరిచిత వ్యక్తి ఉండటం అందరికీ అనుమానాలు వ్యక్తమయ్యాయి. సమంత తిరుమల పుణ్యక్షేత్ర సందర్శన వివరాల్లోకి వెళితే..
గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమంత ఇటీవల కాలంలో తరుచుగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. షిర్డి సాయిబాబా, ఇతర ఆలయాలను సందర్శిస్తూ దైవబలాన్ని సొంతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో సమంత తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాల్లో పూజలు చేశారు.

మార్చి 4వ తేదీన తిరుపతికి చేరుకొన్న సమంత నేరుగా తిరుమలకు వెళ్లారు. అక్కడ శ్రీవారిని దర్శించుకొని దీవెనలు అందుకొన్నారు. అక్కడి నుంచి ఆమె తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకొన్నారు. అయితే ఈ పర్యటనలో ఆమె వెంట తన సన్నిహితుడు ప్రీతమ్ జుకాల్కర్ కూడా ఉండటంతో అతడిపై అందరి దృష్టిపడింది.
అయితే సమంత, నాగచైతన్య విడాకుల సమయంలో ప్రీతమ్ పేరు ప్రముఖంగా వినిపించింది. అతడి కారణంగానే ఆమె దాంపత్య జీవితంలో కలహాలు, విభేదాలు చోటు చేసుకొన్నాయనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని ప్రీతమ్ ఖండించారు.సమంతతో నాకు కేవలం స్నేహం మాత్రమే ఉంది అంటూ సమాధానం ఇచ్చారు.

అయితే తాజాగా సమంతతో నేరుగా ప్రీతమ్ కనిపించగానే సోషల్ మీడియాలో మరోసారి గుసగుసలు వినిపించాయి. అతడిని తీసుకెళ్లడం వెనుక కారణం ఏమిటి? అతడితో ఏదైనా స్నేహానికి మించి రిలేషన్ ఉందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా సమంత తిరుమల పర్యటన మీడియా హెడ్‌లైన్లను ఆకర్షించింది.
సమంతకు సన్నిహితుడుగా ఉండే ప్రీతమ్ జుకాల్కర్ విషయానికి వస్తే.. ఆమె వ్యక్తిగత స్టైలిష్ట్. పలువురు సినీ తారల కోసం కూడా పనిచేసే సెలబ్రిటీ స్టైలిష్ట్. అయితే ఈయనపై కొన్ని గాసిప్స్ వస్తే.. వాటిని ఖండించి.. క్లారిటీ ఇచ్చారు. సమంతకు క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పుడు ఆమె ఉండాలని అనుకొన్నాను అని సమాధానమిచ్చారు.
సమంత ఇటీవల యశోధ, శాకుంతలం, ఖుషి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఖుషీ తర్వాత మరో చిత్రంలో నటించడం లేదనేది తాజా వార్త. పలు ప్రాజెక్టులను ఆమె ఒకే చేయాల్సి ఉందని, ఒక చర్చల దశలోనే కొన్ని కథలు ఉన్నాయనే విషయాన్ని సినీ వర్గాలు చెప్పాయి. అయితే ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్ కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











