Samantha Ruth Prabhu : 12 ఏళ్ల తర్వాత ఆ ఆలయానికి సమంత .. అతనితో రెండో పెళ్లి నిజమేనా?
అక్కినేని నాగచైతన్య గతేడాది శోభిత ధూళిపాళ మెడలో మూడు ముళ్లు వేయడంతో సమంత పరిస్ధితి ఏంటీ? ఆమె కూడా ఎవరినైనా రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? లేక ఒంటరిగానే జీవితం గడుపుతారా? అంటూ రకరకాల ప్రశ్నలు నెటిజన్లను వేధించాయి. నాగచైతన్య పెళ్లితో సమంత ఏం చేసినా? ఏం మాట్లాడిన మీడియాలో అదో సెన్సేషన్ అయ్యింది. తాజాగా సమంత తీర్ధయాత్రలు చేయడం కలకం రేపుతోంది. పనిలో పనిగా ఆమె రెండో పెళ్లి గురించి వార్తలు ఎక్కువయ్యాయి.
సుదీర్ఘకాలం డేటింగ్ తర్వాత నాగచైతన్య - సమంతలు పెద్దల అంగీకారంతో 2017లో ఒక్కటయ్యారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ 2021లో ఈ జంట విడాకులు తీసుకుని చిత్ర పరిశ్రమకు షాకిచ్చింది. వీరి వైవాహిక బంధంపై రకరకాల కథనాలు వచ్చినప్పటికీ .. విడాకులకు సరైన కారణం ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. గతేడాది తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో సమంత - నాగచైతన్యల విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కొద్దిరోజులకే శోభిత మెడలో నాగచైతన్య మూడు ముళ్లు వేశారు.

చైతూతో విడాకుల తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిన సమంత తిరిగి సినిమాలలో బిజీ అవుతుండగా మయోసైటిస్ వ్యాధి బారినపడ్డారు. ఎంతో శ్రమించి ఆ వ్యాధి నుంచి తిరిగి కోలుకున్నారు. ఫ్యామిలీ మెన్ , సిటాడెల్ వెబ్ సిరీస్‌లతో దుమ్మురేపారు. సినిమాలు చేసినా చేయకున్నా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇండియాలో టాప్ హీరోయిన్లను పక్కకునెట్టి సమంత అగ్రస్థానంలో నిలిచారు. ఇక నిర్మాతగా మారి సినిమాలు తీసేందుకు సామ్ రెడీ అవుతున్నారు.
అయితే సమంత రెండో పెళ్లిపై గత కొద్దిరోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. సిటాడెట్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె ప్రేమలో పడ్డారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. రాజ్ నిడిమోరు తెలుగువారు కావడం గమనార్హం. చిత్తూరు జిల్లా ఆయన స్వస్థలం . దీంతో సమంత మరోసారి తెలుగింటి కోడలు కానున్నారంటూ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి.
ఇంత జరుగుతున్నా వీరిద్దరూ ఖండించడం కూడా చేయలేదు. ఇక వాలంటైన్స్ డే సందర్భంగా సమంత పెట్టిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్ని తీసుకొస్తోంది. అలాగే పలు ఈవెంట్స్‌కు కూడా వీరి కలిసి హాజరవుతున్నారట. రాజ్ నిడిమోరుకు ఇప్పటికే పెళ్లి కాగా.. ఆమె కారణంగా సమంతతో వివాహం ఆలస్యమైందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంత తెలుగులో మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తున్నారు.
ఇదిలాఉండగా.. సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా శ్రీకాళహస్తికి వెళ్లి శ్రీకాళహస్త్విశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పట్లో స్టార్ హీరో సిద్ధార్ధ్‌తో ప్రేమలో పడిన సమంత శ్రీకాళహస్తిలోనే రాహు కేతువులకు ప్రత్యేక పూజలు చేశారు. అయితే పెళ్లి పీటలెక్కకుండానే వీరి బంధం తెగిపోయింది. వీరి బ్రేకప్ ఎందుకు జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత తిరిగి శ్రీకాళహస్తిలో రాజ్ నిడిమోరుతో సమంత ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. రాజ్ నిడిమోరుతో పెళ్లి విషయంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా సమంత ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే?


Click it and Unblock the Notifications











