For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విడాకులపై ఎట్టకేలకు పెదవి విప్పిన సామ్.. ఆ షోలో ఓపెన్ కామెంట్స్!

  |

  కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ కొద్ది రోజులలో ప్రసారం కాబోతోంది. తెలుగు వారికి పరిచయం తక్కువే కాని ఈ షో బాలీవుడ్లో అత్యంత వివాదాస్పద షోగా పేరు తెచ్చుకుంది. అనేక విషయాలను సెలబ్రిటీలు ఈ షోలో కుండబద్దలు కొట్టిన ఘటనలు గతంలో చాలానే ఉన్నాయంటున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన సమంత కూడా ఈ షోలో ముఖ్య అతిథిగా పాల్గొని తన విడాకులకు సంబంధించిన అనేక విషయాల మీద స్పందించారని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  దూరం పెరిగి

  దూరం పెరిగి

  చెన్నైలో పుట్టి పెరిగిన సమంత సినిమాల మీద ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేసింది. మొట్టమొదటి సినిమా ఏం మాయ చేసావే లో తన తో హీరోగా నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడిన ఆమె చాలా రోజుల పాటు ప్రేమాయణం నడిపి తరువాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది అంటూ వార్తలు వచ్చాయి. సాధారణంగానే భార్య భర్తల మధ్య గొడవలు రావడం మామూలే కదా అని అందరూ అనుకున్నారు.


  కానీ వీరిద్దరూ విడాకులు కూడా తీసుకు బోతున్నారు అంటూ ప్రచారం మొదలైంది.

  విడి పోతున్నామని

  విడి పోతున్నామని

  ఆ ప్రచారానికి ఊతం ఇచ్చే విధంగానే 2021 అక్టోబర్ నెలలో తాము అధికారికంగా విడాకులు తీసుకుని విడి పోతున్నామని ఈ జంట ప్రకటించింది. ఈ ఇద్దరి అభిమానులు వీరు ఎందుకు విడిపోతున్నారు అని బాధపడుతూ ఉంటే సాధారణ జనం మాత్రం అసలు వీరిద్దరి విడాకులు వెనుక కారణం ఏమిటి అనే విషయం మీద ఎక్కువగా ఆసక్తి చూపించారు.


  రకరకాల కారణాలు తెరమీదకు వచ్చాయి. చాలా వరకు సమంత తప్పు అన్నట్లు చాలా మంది మాట్లాడారు.

  ఎఫైర్ ఉందని

  ఎఫైర్ ఉందని

  సమంత సినిమాల ఎంపిక, డ్రెస్సింగ్ స్టైల్ నాగ చైతన్యకు నచ్చడం లేదని, అయితే ఆమె పిల్లల్ని కనాలని అతను కోరుకున్నా దానికి ఆమె ఒప్పుకోవడం లేదని కొన్ని కథనాలు వెలువడ్డాయి. దానికి తోడు సమంత ఎదుర్కొన్న మరొక ప్రధాన ఆరోపణ తన పర్సనల్ స్టైలిష్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్ ఉందని.


  వివిధ సందర్భాల్లో సమంత, ప్రీతమ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటికి తీసి వాళ్లకు ఎఫైర్ ఉందని ప్రచారం చేయడంతో ప్రీతమ్ సైతం సోషల్ మీడియా వేధింపులు ఎదుర్కొన్నాడు.

  పెదవి విప్పారని

  పెదవి విప్పారని

  చివరికి సమంతను నేను అక్కగా భావిస్తాను అంటూ ప్రీతమ్ వివరణ ఇచ్చుకున్నా ఇప్పటికీ అడపాదడపా కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయి. అయితే అసలు విడాకుల నిర్ణయం ఎవరిది? ఇద్దరిలో ఎవరు విడాకులు తీసుకోవాలని ముందుకు వచ్చారు? సమంత తన పోస్టుల ద్వారా వెలిబుచ్చిన ఆవేదన వెనుక కారణం ఏమిటి? అనే విషయాలు త్వరలో తెలియనుందని అంటున్నారు.

  కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ షోలో పాల్గొన్న సమంత ఈ విషయాలపై పెదవి విప్పారని టాక్ విపిస్తోంది.

  ఓపెన్‌గా మాట్లాడగలరా

  ఓపెన్‌గా మాట్లాడగలరా

  విడాకులకు దారి తీసిన పరిస్థితులు ఏమిటనే అంశం మీద ఓపెన్ అయ్యారని అంటున్నారు. సమంతకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి కాగా త్వరలో ప్రసారం కానుందని అంటున్నారు. అయితే సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఇంకా కొనసాగుతున్న సమంత ఈ విషయాల మీద ఓపెన్‌గా మాట్లాడగలరా అనే చర్చ కూడా జరుగుతోంది.

  English summary
  as per buzz Samantha ruthprabhu opens up about her divorce at coffee with karan show's 7th season.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X