రామ్ చరణ్ ఆఫర్ కాదన్న సమంత
ఏ మాయ చేసావె చిత్రంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిన సమంత తాజాగా రామ్ చరణ్ తేజ చిత్రంలో ఆఫర్ రిజిక్ట్ చేసినట్లు సమాచారం. ధరణి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆమెను అడిగారు. అయితే ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ సరసన చేయటానికి బుక్ అయ్యానని, డేట్స్ లేవని చెప్పినట్లు సమాచారం. ఇక సమంత ప్రస్తుతం ఎన్టీఆర్ తో బృందావనం చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ చిత్రం కూడా త్వరలో ప్రారంభం కానుంది. రవితేజ కొత్త చిత్రం కత్తిలాంటోడులో కూడా ఆమె హీరోయిన్ గా సైన్ చేసినట్లు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్..బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో చేస్తున్నారు. ఇక దర్శకుడు ధరణి ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తో బంగారం చిత్రాన్ని రూపొందించారు.


Click it and Unblock the Notifications











