జూ ఎన్టీఆర్ దెబ్బకు బెంబేలెత్తిపోయిన హీరోయిన్..
'ఏ మాయ చేసావె' చిత్రం సక్సెస్ తో సమంత సినిమా ఆఫర్లతో బిజీబిజీ అయింది. తాజాగా ఆమె జూనియర్ ఎన్టీఆర్ తో 'బృందావనం" చిత్రంలో నటించింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ సమంతను సతాయించాడని ఫిలిమ్ నగర్ కథనం. షూటింగ్ చేసే సమయంలో ఎక్కువసేపు సమంతతోనే గడిపేవాడట ఎన్టీఆర్.
ఈ సతాయింపుతో బెంబేలెత్తిపోయి, ఈ విషయాన్ని నిర్మాతతో చెప్పిందట. ఆయనంతే..చాలా సరదాగా ఉంటాడని నిర్మాత అన్నాడట. దీంతో ఏమీ చేయలేక, ఎంతో ఓపిగ్గా చిత్రం పూర్తయ్యే వరకూ ఆగిందట. ఇపుడెవరైనా కదిలిస్తే...బాబోయ్ జూనియర్ ఎన్టీఆర్ తోనా.. నావల్ల కాదు అంటోందట. అయితే మెన్నీ మద్య టీవీ ఇంటర్వ్యూలో తారక్ తో మరో సినిమా చేయాలని ఉంది. అలాంటి అవకాశం వస్తే మాత్రం వదులుకోను అంటోంది కాజల్ అగర్వాల్. మరి ఈమెను ఆటపంటించలేదా అనే భావన కూడా ఇండస్ట్రీ వర్గాలకు కలుగుతోంది. బాలరామాయణం సమయంలోనే సహనటీమణుల్ని ఏడిపించేవాడని ఆ చిత్రంలో నటించిన కొందరు చెపుతుంటారు. అదే అలవాటు ఇంకా కొనసాగుతోందని అంటున్నారు. అయితే సమంత విషయంలో ఆమెను ఎలాంటి ఆటతో ఆటపట్టించాడన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు.


Click it and Unblock the Notifications











