రాజమౌళి ‘ఈగ’ హీరోయిన్ ప్రపోసల్ వెనుక సీక్రెట్ ఏంటంటే...?
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'ఈగ" చిత్రంలో నాని సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. ఎంతో క్రేజ్ తెచ్చుకుని మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ లతో జతకట్టిన సమంత చిన్న హీరో నాని పక్కన యాక్ట్ చేయడం ఏంటని కొంతమంది చర్చించుకుంటున్నారు. దీనికి వెనుక రాజమౌళి ఓ ట్రిక్ ప్లే చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 'ఈగ"లో చేస్తే.. తన తదుపరి చిత్రంలో ప్రభాస్ హీరోగా దర్శకత్వం వహించబోయే చిత్రంలో కథానాయికగా అవకాశం ఇస్తానని సమంతకు చెప్పాడట రాజమౌళి. దాంతో ఈ అమ్మడు 'ఈగ"కి సైన్ చేసిందని సమాచారం. 'మగధీర"లో 'సలోని"కి ఓ పాటలో అవకాశం ఇచ్చి ఆ తర్వాత 'మర్యాద రామన్న"లో కథానాయికగా అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు సమంత విషయంలో కూడా రాజమౌళి అదే ట్రిక్ ప్లే చేశాడన్నమాట.
సమంత రాజమౌళి ఈగ ప్రభాస్ సలోని మగధీర మర్యాద రామన్న samantha rajamouli eega prabhas saloni magadheera maryada ramanna


Click it and Unblock the Notifications