పవన్ కళ్యాణ్ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన సమంత

By Srikanya

ఏమి మాయ చేసావే చిత్రంతో పరిచయమైన సమంత ...ఆ తర్వాత బృందావనం లో మోడ్రన్ డ్రెస్ లు వేసుకుని మరీ యూత్ గుండెలకు పట్టేసింది. దాంతో ఆమె ఇప్పుడు మహేష్ సరసన దూకుడులో చేస్తోంది. అలాగే తాజాగా పవన్ కళ్యాణ్ సరసన కూడా కమిటయినట్లు సమాచారం. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తారు . అలాగే లక్ష్మీ,కృష్ణ వంటి చిత్రాల ద్వారా రచయితగా ప్రూవ్ అయిన ఆకుల శివ ఈ చిత్రానికి కథ ఇస్తున్నారు. ఈ చిత్రానికి 2011 మార్చి నుంచి పవన్ డేట్స్ ఇవ్వనున్నారు.

ఇక పులి చిత్రం ప్లాప్ తర్వాత పవన్ వరసగా సినిమాలు కమిట్ అవ్వటానికి ఉత్సాహం చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై జయంత్ దర్సకత్వంలో ఖుషీగా అనే చిత్రం చేస్తున్నారు. బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ కిది రీమేక్. పవన్ సరసన త్రిష ఈ చిత్రంలో చేస్తోంది. ఆయన తన తదుపరి చిత్రంగా వినాయిక్ చిత్రాన్ని ఓకే చేసారు. మరో ప్రక్క సింగీతం దర్శకత్వంలో రూపొందుతున్న క్రీస్తు చరిత్రలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్ర వేస్తున్నారు. అలాగే వివి వినాయిక్ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ హీరోగా బద్రీనాధ్ చిత్రం చేస్తున్నారు. సమంత..శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న దూకుడులో బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X