ఓ వైపు పెళ్లి వార్తలు..సమంత మళ్లీ అతనితో..!

By Bojja Kumar

హైదరాబాద్: సిద్దార్థ, సమంతాల ప్రేమాయణం నడుస్తోందని, ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిపై మీడియాలో వచ్చే వార్తలు వార్తలుగానే ఉన్నాయి తప్ప ఎప్పుడూ దీనిపై వారి నుండి ఎలాంటి సమాధానం మాత్రం రాలేదు. దీంతో వారి గురించి తెలిసిన వారంతా ప్రేమ వార్తలను ఇద్దరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

గతంలో ఇద్దరూ జబర్దస్త్ అనే చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వెండితెరపై జతకట్టబోతున్నారు. మలయాళంలో విజయవంతమైన బెంగళూరుడేస్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయబోతున్నారు. అంజలిమీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేరళలో సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో దిల్‌రాజు తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. సిద్ధార్థ, సమంతా సినిమాకు ఓకే చెప్పినట్లు టాక్. ఈ సినిమాలో సిద్దార్థ, సమంతా భార్యాభర్తలుగా కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Samantha, Siddharth in Bangalore Days remake

సినిమాల పరంగా ప్రస్తుతం టాప్ లో ఉన్న సమంత...ఇటు యాడ్ ఫిల్మ్స్ విషయంలోనూ అందరికంటే ముందు ఉంది. వీటి ద్వారా ప్రస్తుతం సౌత్ లో అత్యధికంగా సంపాదిస్తున్న హీరోయిన్ కూడా ఆమె అని అంటున్నారు. సమంత కూడా వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా చేస్తోంది. తాజాగా హీరోయిన్ సమంత కోకాకోలా కంపెనీ ఉత్పత్తి అయిన ‘మాజా'కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపకయింది. సౌత్ లో మాజా యాడ్ కు ఎంపికయిన తొలి హీరోయిన్ సమంతే కావడం విశేషం. త్వరలో సమంతతో నోరూరించే యాడ్లు చిత్రీకరించి జనాలపైకి వదలబోతున్నారు.

సమంత ఇతర సినిమాల విషయానికొస్తే... ఇటీవల ఆమె తమిళంలో కత్తి చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. విజయ్ హీరోగా నటించారు. తమిళంలో సమంతకు ఇదే ఇప్పటి వరకు తొలి మరియు అతి పెద్ద హిట్. ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం సమంత తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య, ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగు దశలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X