సునీల్ సినిమా కి సమంత గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : ఓ సినిమాకు క్రేజ్ తేవటానికి ఫిల్మ్ మేకర్స్ రకరకాల టెక్నిక్స్ వాడుతూంటారు. హీరోలను ని సింగర్స్ చేస్తూంటారు. సింగర్స్ ని డాన్సర్స్ చేస్తూంటారు. ఇప్పుడు హీరోయిన్ సమంతని సింగర్ చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. సునీల్ చిత్రం కోసం ఆమె గొంతు విప్పి తొలిసారిగా పాడే అవకాసం ఉందని సమాచారం. ఈ మేరకు నిర్మాత సురేష్ బాబు ఆమెను అడిగినట్లు ఆమె ఓకే చేసినట్లు తెలుస్తోంది. సురేష్ బాబు లాంటి పెద్ద నిర్మాత అడిగాక కాదనే ధైర్యం ఏ హీరోయిన్ కి ఉంటుందని అంటున్నారు. ఇక ఆమె పాడబోయే చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించే 'భీమవరం బుల్లోడు' అని తెలుస్తోంది. ఈ వార్తే నిజమైతే ఇదే సమంత పాడబోయే మొదటి చిత్రం అవుతుంది.
సునీల్ హీరోగా ఉదయశంకర్ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ 'భీమవరం బుల్లోడు' చిత్రాన్ని నిర్మిస్తోంది. '1000 అబద్ధాలు' చిత్రం ఫేమ్ ఎస్తేర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రనిర్మాత సురేశ్‌బాబు మాట్లాడుతూ 'మా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థకు ఇది 50వ సంవత్సరం. ఈ నేపథ్యంలో వస్తున్న 'భీమవరం బుల్లోడు' చిత్రం మా బేనర్‌కు ఎంతో ప్రతిష్టాత్మకం కానుంది. భీమవరం వాసి అయిన సునీల్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండటంతో చిత్రానికి ఆయన ఊరి పేరే పెట్టాం. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలను త్వరలో విడుదల చేస్తాం' అని తెలిపారు.
దర్శకుడు ఉదయశంకర్ మాట్లాడుతూ 'కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ 'కలిసుందాం..రా', 'బలాదూర' తరువాత సురేశ్ సంస్థలో నేను పనిచేస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో సునీల్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో పని చేయడం ఆనందంగా ఉంది' అని చెప్పారు.
తనికెళ్ల భరణి, జయప్రకాశ్‌రెడ్డి, షాయాజి షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, 'అదుర్స్' రఘు, 'సత్యం' రాజేశ్, శ్రీనివాసరెడ్డి, గౌతంరాజు,తాగుబోతు రమేశ్, సామ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: కవి కాళిదాస్, మాటలు: శ్రీధర్ సీపన, సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: సంతోష్ రాయ్, నిర్మాత: సురేశ్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఉదయశంకర్.


Click it and Unblock the Notifications












