»   » లండన్‌లో చికిత్స చేయించుకున్న సమంత

లండన్‌లో చికిత్స చేయించుకున్న సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ సమంత రీసెంట్ గా లండన్ లో చికిత్స పూర్తి చేసుకుని వచ్చినట్లు చెన్నై వర్గాల సమాచారం. ఆమెను చాలా కాలంగా స్కిన్ ఎలర్జీ పట్టి పీడిస్తోంది. ఆ స్కిన్ ఎలర్జీతో ఆమె శంకర్,మణిరత్నం చిత్రాలు సైతం వదులుకుంది. అంతేకాదు ఈ మధ్యన ఆమె తమిళ చిత్రం అంజాన్ షూటింగ్ లో ఉండగా మళ్లీ వచ్చింది. దాంతో షూటింగ్ గ్యాప్ ఇచ్చి లండన్ లో చికిత్స చేయించుకుని వచ్చింది. ఈ చికిత్సతో ఆ సమస్య శాశ్వతంగా తొలిగినట్లే అని చెప్తున్నారు. ఆ మధ్యన మేనేజరతో మాట్లాడి మరీ లండన్ వెళ్లానని చెప్పింది దీనికే అంటున్నారు.

ఎన్టీఆర్‌, మహేష్‌, పవన్‌ వంటి అగ్ర హీరోలతో జతకట్టి టాలీవుడ్‌ టాక్‌ ఆఫ్‌ది హీరోయిన్‌గా నిలిచిన ఈ అమ్మడు.. ప్రస్తుతం కోలీవుడ్‌ క్వీన్‌గా మారనుంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తోంది సమంత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలోనే ఉండగా మరో పెద్ద హీరో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

 Samantha

మరో ప్రక్క సమంత కూడా కొన్నాళ్ల వరకూ తెలుగు సినిమాలకు అందుబాటులో ఉండనని ప్రకటించింది. కారణం.. తమిళ, మలయాళ రంగాల్లో దృష్టి పెట్టడమే. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. 'మనం'లోనూ సమంతే కథానాయిక. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికీ సంతకం పెట్టింది. వీటితో పుల్‌స్టాప్‌ పెట్టేసింది సమంత. కొత్త కథలు వినడం లేదు. విన్నా ఒప్పుకోవడం లేదు. ''గత మూడేళ్లుగా తెలుగు సినిమాతో మమేకమైపోయా. నటిగా నాకు భాషా బేధం లేదు. తమిళ, మలయాళ చిత్రాలనుంచీ ఆహ్వానం అందుతోంది. త్వరలో ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నా. అందుకే తెలుగు సినిమాలకు తాత్కాలికంగా దూరం అవుతున్నా'' అంటోంది సమంత.


ప్రస్తుతం సమంత పలు చిత్రాల షూటింగులతో బిజీగా గడుపుతోంది. ఆమె నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సమంత నటించిన మరో చిత్రం 'ఆటో నగర్ సూర్య' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అక్కినేని మల్టీ స్టారర్ మూవీ 'మనం', సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న టైటిల్ ఖరారు కాని సినిమాతో పాటు, వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరొక తెలుగులో సినిమాలో నటిస్తోంది. వీటి తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో ఓ తమిళ చిత్రంలో సమంత నటించనుంది.

English summary
Samantha said that she is having a tour to London but real reason behind this is skin allergy curing and she will be completely fine after this cure said a close source. Samantha is starring in three movies and signed many more movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu