Samantha నాగచైతన్యతో విడాకులకు కారణం ఆమేనా? ఇన్నాళ్లకు బయటపెట్టిన సమంత!
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి తెలిసిందే. క్రమక్రమంగా సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారుతోంది. ఒకప్పుడు తన అందం, నటనతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితం వల్ల పలుసార్లు వార్తల్లో ఎక్కువగా నిలిచింది. ఇప్పటికీ తన పర్సనల్ విషయాలతో నెట్టింట్లో హాట్ టాపిక్‌గా ఉంటుంది. అయితే ఈమె తన మాజీ భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకోవడానికి కారణమైన వ్యక్తి గురించి తాజాగా తెలిసింది! సోషల్ మీడియాలో ఇప్పుడీ విషయమే ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.
నాగచైతన్య - సమంత ఒకప్పుడు ఈ కపుల్‌కు ఎంతో మంది అభిమానులు ఉండేవారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కానీ ఈ జంట మాత్రం కలిసి లేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు పరస్పర అంగీకారంతో కొన్నేళ్ల క్రితం ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరు ఏదో ఒక విషయంలో వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉన్నారు. మరో వ్యక్తితో రెండో పెళ్లి, రిలేషన్షిప్ అంటూ రకరకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే సమంత విషయానికొస్తే విడాకుల తర్వాత కూడా కెరీర్లో దూకుడు చూపిస్తూ మరింత స్టార్ స్టేటస్‌ను అందుకుంది. అందాల ఆరబోతలోనూ హద్దులు లేకుండా ప్రదర్శించింది. అయితే ఆ మధ్య కాలంలో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఏడాది పాటు విదేశాల్లో చక్కర్లు కొడుతూ మనసుకు నచ్చినట్టు గడిపింది. రీసెంట్‌గానే మళ్లీ బ్యాక్ టు ప్రొఫెషనల్ వర్క్‌లో అడుగుపెట్టింది.

అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ సమంత సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గానే ఉంటూ వస్తోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి లేదా టూర్స్ ట్రావెల్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూనే ఉంది. అలా అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే సామ్ తాజాగా ఓ పోస్ట్ చేసి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. మలేషియాలో తన స్నేహితురాలితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. ఆ అమ్మాయి పేరు మేఘన. నేను తీసుకున్న మంచి నిర్ణయాలకు ఫేస్ పెడితే అది మేఘననే అంటూ వ్యాఖ్య కూడా రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతోంది. ఇక ఈ పోస్ట్ చూసిన కొందరైతే అంటే విడాకుల నిర్ణయం వెనకాల కూడా ఉంది ఇమేనా.? అంటూ విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు.
ఇకపోతే గతంలో కూడా నాగచైతన్య సమంత విడిపోయినప్పుడు - వారిద్దరు విడిపోవడానికి వీళ్లే కారణమంటూ కొంత మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అందులోనూ ఈ మేఘన వినోద్ పేరు కూడా ఉంది. ఇప్పుడామెతోనే సామ్ ఫొటో దిగి తాను తీసుకున్న మంచి నిర్ణయాలకు అండగా ఉందంటూ రాసుకురావడంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కాగా, సమంత త్వరలోనే ఇండియన్ వెర్షన్ సిటాడెల్‌తో ప్రేక్షకులను అలరించనుంది.


Click it and Unblock the Notifications











