ఆ సూపర్ స్టార్ చివరి సినిమాలో సమంత?.. అదిరిపోయే రీ ఎంట్రీతో సామ్!
ప్రెజెంట్ ఇండియన్ సినిమా దగ్గర కేవలం సౌత్ సినిమా హీరోల హవా మాత్రమే కాకుండా కొందరు స్టార్ హీరోయిన్స్ హవా కూడా నడుస్తుంది. మరి ఇలాంటి స్టార్ హీరోయిన్స్ లో ఇప్పుడు తెలుగు, తమిళ్ సహా హిందీ ఆఫర్స్ కూడా చేతిలో ఉన్న వారిలో రష్మిక మందన్నా, తమన్నా ఇంకా కొందరు గ్లామరస్ హీరోయిన్స్ ఉన్నారు. అయితే వీరితో పాటుగా వీరిని మించి మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ఉన్న హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు.
కాగా సామ్ గత కొన్నాళ్ల నుంచి సినిమాలకి దూరంగా ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఆమె తన పర్శనల్ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకున్నాక కొన్ని సినిమాలు చేసింది కానీ ఆ క్రమంలోనే ఆమెకి మాయోసైటిస్ అనే జబ్బు ఉందని బయట పడింది. దీనితో ఆ వ్యాధితో బాధ పడుతూ చికిత్స తీసుకుంటూనే సోలో గా రెండు సినిమాలు "యశోద", "శాకుంతలం" పూర్తి చేసి రిలీజ్ చేసింది.
అయితే వీటిలో యశోద భారీ హిట్ కాగా శాకుంతలం దారుణమైన డిజాస్టర్ అయ్యింది. ఇలా సోలో సినిమాలు తర్వాత విజయ్ దేవరకొండ తన హిట్ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో "ఖుషి" సినిమా చేసి ఫామ్ లోకి వచ్చింది.

అయితే ఇక ఈ సినిమాతో అన్నిటికి స్వస్తి చెప్పింది. తాను తన ట్రీట్మెంట్ కోసం గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తానని తెలిపింది. అయితే అందులో భాగంగానే ఇప్పుడు తన రీ ఎంట్రీ గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇంత గ్యాప్ వచ్చినా కూడా సమంత ఏమాత్రం ఆఫర్లు తగ్గలేదట. జస్ట్ రీసెంట్ గానే హిందీలో ఓ సాలిడ్ వెబ్ సిరీస్ ని సమంత ఓకే చేయగా ఇప్పుడు బిగ్ స్క్రీన్స్ పై కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు ఓ భారీ చిత్రం ఓకే చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
కాగా ఆ సినిమానే తలపతి విజయ్ నటించనున్న ఆఖరి సినిమా అన్నట్టుగా వినిపిస్తుంది. విజయ్ తన చివరిగా ఒక్క సినిమా చేసి ఆపేస్తానని అనౌన్సమెంట్ చేసేసాడు. అయితే ఇది ఎప్పుడు ఎవరితో అనేది పెద్ద సస్పెన్స్ గా మారగా ఇప్పుడు ఫైనల్ గా ఈ చిత్రంపై కొంచెం క్లారిటీ వస్తుంది. ఈ సినిమాని హెచ్ వినోద్ దర్శకత్వం వహించనుండగా తాను సమంత ని హీరోయిన్ గా ఎంచుకున్నట్టుగా వినిపిస్తుంది.

అలాగే ఈ సినిమాతోనే సమంత రీఎంట్రీ ఇస్తుంది అని కూడా టాక్. ఇలా ఒక పక్క ఓటిటి ఇంకో పక్క బిగ్ స్టార్ తో సినిమా ఓకే చేసి సమంత అయితే ఇప్పుడు గ్రాండ్ రీ ఎంట్రీకి గట్టి ప్లానింగ్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. మరి విజయ్ తో సినిమా ఓకే అయితే వరుసగా మూడో సినిమా వారి కెరీర్ లో అని చెప్పాలి. తేరి, ఇంకా మెర్సల్ సినిమాలో సమంత విజయ్ సరసన నటించింది. ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు విజయ్ సినిమాతో సమంత రీఎంట్రీ ఇస్తే విజయ్ ఆ సినిమాతో గుడ్ బై చెప్పడం గమనార్హం.


Click it and Unblock the Notifications