సమంత తీవ్ర మనస్తాపం.. నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ తర్వాత షాకింగ్ నిర్ణయం!
తెలుగు సినిమా దగ్గర మంచి ఆదరణ ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో పాన్ ఇండియా స్టార్ బ్యూటీ సమంత కూడా ఒకరు. మరి సామ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. అయితే కెరీర్ పరంగా కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ సినిమాలు, వెబ్ సిరీస్ లు మొదలు పెట్టిన సామ్ ఇపుడు పలు భారీ చిత్రాలు సిరీస్ లు ఓకే చేసి మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది.
అయితే తాజాగా వీటితో పాటుగా ఆమె మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి విషయంలో పలు కామెంట్స్ తో సోషల్ మీడియాలో ప్రతి రోజు ఏదొకలా ఆమె పేరు ప్రస్తావనకు వస్తూనే ఉంది. కాగా ఈ సమయంలో ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా పలు రూమర్స్ గుప్పుమన్నాయి. సమంత ఇప్పుడు రీఎంట్రీ ప్లానింగ్ తెలుగు సినిమాలకి ఇక దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యింది అంటూ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

కాగా ప్రస్తుతం తెలుగులో "మా ఇంటి బంగారం" అనే సినిమా ఆమె ప్రొడక్షన్ లోనే చేస్తుంది. అయితే ఈ సినిమా మినహా ఇంకే సినిమా తెలుగులో చేయకూడదు అన్నట్టుగా డిసైడ్ అయ్యింది అని షాకింగ్ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. అయితే దీనికి కారణం ఆమెపై ఇపుడు కనబరుస్తున్న నెగిటివిటీ అని, దీనితో సామ్ బాగా హర్ట్ అయ్యింది అని, అందుకే ఇక తెలుగులో సినిమాలకి స్వస్తి చెప్పాలని డిసైడ్ అయిపోయింది అంటూ రూమర్స్ మొదలయ్యాయి.
కానీ మరో పక్క అదేం లేదు ఆమె చేయకపోవడం కాదు తెలుగు నుంచే ఆమెకి ఆఫర్స్ ఉండి ఉండవు నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. అయితే ఎంత లేదనుకున్నా సమంతకి స్టార్ స్టేటస్ ఇచ్చింది తెలుగు సినిమానే ఇక్కడ నుంచే సమంత స్టార్ గా ఎదిగి పాన్ ఇండియా వరకు అయినా వెళ్ళింది అని చెప్పాలి. సో సమంత అంత సినిమాని వదిలేస్తుంది అంటే ఆశ్చర్యమే అన్ని చెప్పాలి.
మరి చూడాలి ఈ రూమర్స్ పై ఆమె ఏమైనా చెక్ చెప్తుందో లేదో అనేది. కాగా ఇప్పుడు సమంత నుంచి అవైటెడ్ స్పై థ్రిల్లర్ సిరీస్ "సిటాడెల్ హనీ బన్నీ" అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానుండగా ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నటిస్తుండగా ఈ సిరీస్ ని సమంత కాంట్రవర్సియల్ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ అండ్ డీకే లు తెరకెక్కించారు.
అలాగే ఈ సిరీస్ హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ కి రీమేక్ గా ఇండియన్ వెర్షన్ లో చేయబడింది. ఇక ఇది కాకుండా మరో వైపు టాప్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ తో "రక్త బ్రహ్మాండ్" అనే సిరీస్ ని "తుంబాడ్" ఫేమ్ దర్శకుడు అనీల్ రాహీ బార్వే తో చేస్తుంది. ఇందులో కూడా సమంత బోల్డ్ గానే కనిపిస్తుంది అని టాక్ ఉంది. ఇలా ఓటిటి పరంగా సమంత ఫుల్ బిజీగా ఉంది


Click it and Unblock the Notifications











