»   » సమంత దెయ్యం నవ్వు: సిద్ధార్థను టార్గెట్ చేసిందా?

సమంత దెయ్యం నవ్వు: సిద్ధార్థను టార్గెట్ చేసిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే సమంత.... తన ప్రత్యర్థులపై చమత్కారమైన ట్వీట్లతో విరుచుకుపడుతూ ఉంటుంది. పలుసార్లు తన ట్వీట్లతో వివాదాలు సృష్టించడంతో పాటు తరచూ తన ఫన్నీ ట్వీట్లతో అభిమానులను ఎంటర్టెన్ చేస్తూ ఉంటుంది. తాజాగా సమంత చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది.

#evillaugh #buhahahaha ok calm Sam.." అంటూ తాజాగా సమంత ట్వీట్ చేసింది. ఎవరితో ఉద్దేశించి దెయ్యం నవ్వు నవ్వింది. అయితే చిన్న క్లూ కూడా ఇవ్వకుండా సమంత ఈ ట్వీట్ చేసింది. ఆమె చేసిన ఈ ట్వీట్ ఎవరిగురించి అయి ఉంటుంది? అని అభిమానులంతా తెగ ఆలోచిస్తున్నారు.

Samantha Targets Siddharth With Her Evil Tweet?

ట్వీట్టర్లో ఆమె వ్యవహార శైలిని పరిశీలించిన వారు మాత్రం...ఆమె చేసిన ట్వీట్ తన మాజీ ప్రియుడు సిద్ధారను ఉద్దేశించి అంటున్నారు. ఇటీవల సమంతను సిద్ధార్థ ట్వీట్టర్లో అన్-ఫాలో చేసాడట. వెంటనే సమంత కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సిద్ధార్థను అన్ ఫాలో చేసిందట. అందుకే ఆమె ఈ ట్వీట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్.

ఆ సంగతి పక్కన పెడితే.... సమంత గురించి ఈ మధ్య కోలీవుడ్లో రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా సమంత ఓ తమిళ వ్యపారవేత్తతో క్లోజ్ గా ఉంటుందనేది తమిళ మీడియాలో వినిపిస్తున్న వార్తలు. అతనికి తమిళ సినిమా రంగంతో సంబంధాలు ఉన్నాయని, కొన్ని తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పని చేసాడని టాక్. సమంత అతనితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు కూడా తమిళ ఇండస్ట్రీలో చెవులు కొరుకుంటున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

English summary
Samantha never leaves an opportunity to taunt her rivals with her witty tweets. She is known to be the most controversial actress and a fun loving twitterati. Leaving her fans puzzled, Samantha tweeted that "Sometimes 'an eye for an eye and a tooth for a tooth' is too tempting to resist. #evillaugh #buhahahaha ok calm Sam.." Though initially nobody has got any clue why Samantha is laughing evilly, some of her enthusiastic fans figured it out in no time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu