మహేష్-వెంకీల మల్టీ స్టారర్ లో ఆ ఇద్దరు టాప్ హీరోయిన్స్..?

By Sindhu

తెలుగు ప్రేక్షకుల కలలు ఫలిస్తూ అగ్ర కథానాయకుల మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. వెంకటేష్, మహేష్‌ బాబు లాంటి స్టార్‌ డమ్ వున్న కథానాయకులిద్దరూ ఈ చిత్రంలో నటిస్తుండటం వల్ల ప్రారంభంలోనే టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీగా ఈ చిత్రం వార్తల్లోకెక్కింది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల ('కొత్త బంగారులోకం" ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో వెంకటేష్, మహేష్‌ బాబు అన్నదమ్ములుగా నటించనున్నారు. అయితే వీరిద్దరికీ జోడీగా నటించే ముద్దుగుమ్మలెవరూ అనే విషయం ఇప్పుడూ సినీ వర్గాలో చర్చనీయాంశం అయింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో వెంకటేష్-మహేష్‌ లకు జోడీగా త్రిష, సమంతలు నటించనున్నట్లు తెలిసింది. ఇందుకు చాలా కారణాల్ని చూపెడుతున్నారు సినీ జనాలు. వెంకటేష్-త్రిష జంటను పరిశ్రమలో లక్కీపెయిర్‌ గా అభివర్ణిస్తారు. వీరిద్దరూ కలసి నటించిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే", 'నమో వెంకటేశ చిత్రాలు చక్కటి ప్రేక్షకాదరణ పొందాయి.

అంతేకాదు వెండితెరపై ఈ జంట కన్నులపండువగా వుంటుందని ప్రేక్షకులు భావిస్తారు. తాజాగా త్రిష-వెంకటేష్ 'బాడీగార్డ్" చిత్రంలో కూడా జోడీ కడుతోంది. దీంతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రంలో కూడా వీరిద్దరి జోడీ అయితే బాగుంటుందని నిర్మాతల ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

'దూకుడు"లో మహేష్‌ బాబుతో జతకట్టి లక్కీగాళ్ అనిపించుకున్న సమంత మరోసారి ఈ చిత్రంలో ఆయనతో జతకట్టడం ఖాయమని చెబుతున్నారు. ఆల్రెడీ దిల్‌ రాజు బ్యానర్‌ లో 'బృందావనం" చిత్రంలో నటించిన సమంత నిర్మాతల దృష్టిలో రైట్ ఛాయిస్‌ గా వుందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఇండస్ట్రీలో మోస్ట్ అవెయిటెడ్ మల్టీస్టారర్ చిత్రానికి ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు మరింత వన్నె తీసుకురావడం ఖాయం అంటున్నారు అభిమానులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X