నిర్మాతగా మారుతున్న సమంత?

By Bojja Kumar

హైదరాబాద్: హీరోయిన్ సమంత నిర్మాతగా మారబోతోందా? అంటే అవుననే వార్తలు ఇపుడు ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తున్నాయి. ఏంటి సమంత ఆ రేంజిలో సంపాదించిందా? అంటే సంపాదించిందనే అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. వరుస అవకాశాలతో నెం.1 స్థానానికి చేరిన సమంత ఇండస్ట్రికీ వచ్చిన నాలుగేల్లలో దాదాపు పాతిక చిత్రాల్లో నటించింది. దీనికి తోడు వాణిజ్య ప్రకటనలు, షాపుల ఓపెనింగుల ద్వారా అదనపు సంపాదన కూడా.

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇటీవల నటించిన 'క్వీన్' అనే హిందీ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు అందాయి. ఇందులో కంగనా రనౌత్ పెర్ఫార్మెన్స్ కూడా అదరహో అనే విధంగా ఉందని మెచ్చుకున్నారంతా. ఇటీవల ఈ సినిమా చూసిన సమంతకు కూడా బాగా నచ్చేసింది.

Samantha to turn a producer?

ఈ చిత్రాన్ని సౌత్‌లో రీమేక్ చేస్తే బాగుటుందని, క్వీన్ చిత్రంలో కంగనా రనౌత్ పోషించిన పాత్ర చేయాలని ఉందని సమంత కోరుకుంటోందట. అయితే లాంటి తరహా చిత్రాలకు దక్షిణాదిన ఆదరణ సరిగా ఉండదనే నెపంతో చాలా మంది నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. ఈ నేపథ్యంలో తానే ఆ చిత్రం నిర్మాణ బాధ్యతలు చేపట్టాలనే ప్లాన్లో సమంత ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం సమంత నటిస్తున్న సినిమాల విషయానికొస్తే....ఆమె తెలుగులో నటించిన ఆటోనగర్ సూర్య, మనం చిత్రాలు పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. దీంతో పాటు మరో రెండు తెలుగు చిత్రాలు, రెండు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది సమంత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X