హాట్ టాపిక్ :'ఆగడు' మీద సమంత ట్వీటేసింది
హైదరాబాద్ : 'ఆగడు' సినిమా ఫ్లాపు అవటం సంగతేమో గానీ కౌంటర్ల మీద కౌంటర్లు పడుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ వంటి కొందరు డైరక్ట్ గా బాణాలు వదులుతూంటే ప్రకాష్ రాజ్, కోన వంటివారు ఇండైరక్ట్ గా ట్వీట్స్ చేసారు. తాజాగా సమంత చేసిన ట్వీట్ సైతం ఆగడు గురించే అనే వార్త అంతటా ప్రచారంలోకి వచ్చింది.
సమంత హఠాత్తుగా బూమరాంగ్ గురించి ప్రస్తావించింది. "బూమరాంగ్ లు చాలా ప్రత్యేకమైనవి...ఎంత బలంగా విసిరితే అంతే వేగంగా తిరి వచ్చి మనకే తగులుతాయి.. ". అంటూ ట్వీటేసింది. ఆ ట్వీట్ లో ఎక్కడా ఆగడు గురించి ప్రస్తావన లేకపోయినప్పటికీ...ఈ ట్వీట్ ఖచ్చితంగా శ్రీను వైట్ల ను ఉద్దేశించే అంటున్నారు.

శ్రీను వైట్ల తన సినిమాల్లో అందరికీ సెటైర్లు వేసాడు..అవి బూమరాంగ్ లలాగ తిరిగి వచ్చి తనకే తగిలాయని ఆమె ఇండైరక్ట్ గా అంటోందని చెప్పుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ సైతం క్యారక్టర్, నైతిక విలువలు, గౌరవం, ఇంగిత జ్ఞానం, నడవడిక వంటి తదితర విలువలని డబ్బుతో కొనలేమని ట్వీట్ చేసారు.
ఇక ట్వీట్స్ లో సమంత, ప్రకాష్ రాజ్ ఎక్కడా శ్రీను వైట్ల లేదా ఆగడుని ప్రస్దావించకపోయినా ...నీ గురించే ట్వీట్ చేస్తున్నాడంటూ పలువురు శ్రీను వైట్లకు ట్యాగ్ చేయటం మొదలెట్టారు. ఈ మధ్య కాలంలో ఏ దర్శకుడూ ఇంతలా విమర్శలను ఎదుర్కోలేదన్నది మాత్రం నిజం.


Click it and Unblock the Notifications











