మహేష్ బాబు పై చిరాకు పడుతోన్న సమంతా..?
నిండా రెండు సినిమాలు చేసిందో లేదో అప్పుడే సమంతాకి టెన్షన్ తో తలనొప్పి వచ్చేస్తోందట. 'ఓ పక్క షూటింగులు... రకరకాల ప్లేసెస్ కి మారుతుండాలి..వేళాపాళా వుండదు. మరో పక్క కొత్త సినిమాల చర్చలు... కథలు వింటుండాలి... ఇంకో పక్క విన్న కథల్ని ఎసేస్ చేసుకోవడం...అబ్బా.. బిజీ బిజీ... హడావిడి హడావిడి అయిపోతోంది జీవితం. దాంతో ఒత్తిడి ఎక్కువైపోతోంది' అంటోంది ఈ చెన్నయ్ సుందరి.
ఇప్పుడీ స్ట్రెస్ తగ్గించుకోవడం అన్నది తనకు పెద్ద సమస్య అయిపోయిందట. అందుకోసం రోజూ సినిమాలు చూడడం, మనసుకు నచ్చిన సంగీతాన్ని వినడం చేస్తున్నానని అంటోంది. అలాగే, యోగా కూడా మొదలుపెట్టిందట. ప్రతి రోజూ క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మంచి ఫలితం కనపడుతోందని చెబుతోంది సమంతా. ప్రస్తుతం మహేష్ 'దూకుడు' సినిమాలోనూ, రాజమౌళి 'ఈగ' సినిమాలోనూ తను నటిస్తోంది. కాగా మహేష్ తో హీరోయిన్ గా చేయడానికి మొదట అత్యుచ్చాహం చూపించిన ప్రస్తుతం చీరాకు పడుతోందని సమాచారం. దానికి కారణం మహేష్ దూకుడు త్వరగా పూర్తికాలేదని తను ఇతర ప్రొజెక్ట్స్ ను కమిట్ అవలేకపోతున్నాని అటు అందుకు కారకులైన మహేష్ మీద తర్వాత దూకుడు చిత్ర దర్శకుడ పైన సమంత పూప్తిగా అసంతృప్తిగా ఉన్నదని సమాచారం.


Click it and Unblock the Notifications











