మహేష్ 'దూకుడు' కి భలైపోతున్న సమంతా కెరీర్..?
'ఏ మాయ చేశావే", 'బృందావనం" చిత్రాలతో కుర్రాళ్ల మనసుల్లోకి స్పీడుగా చొచ్చుకుపోయిన చెన్నయ్ బ్యూటీ సమంతా ఏ క్షణాన 'దూకుడు" సినిమా కమిట్ అయిందో కానీ, ఇంతవరకు ఆ సినిమా పూర్తి కాలేదు సరికదా, మరో సినిమా చేయడానికి డేట్స్ కూడా ఇవ్వలేకపోతోంది. అలా ఆ సినిమా షూటింగుకి ఆమె డేట్స్ అన్నీ బలైపోతున్నాయట. అక్కడికీ దర్శకుడితో పలుసార్లు తన కెరీర్ గురించి చెప్పుకుని వాపోయిందట కూడా. తను మాత్రం ఏం చేస్తాడు? మహేష్ బాబు నెమ్మది (బద్ధకం?) వల్ల షూటింగ్ స్పీడుగా సాగడంలేదన్నది మొదటి నుంచీ టాలీవుడ్ లో వింటున్నదే.
దాంతో అతనితో సినిమా చేస్తున్నందుకు ఆనందించాలో… లేక తన డేట్స్ అన్నీ ఇలా ఒక్క సినిమాతోనే మురిగిపోతున్నందుకు బాధపడాలో సమంతాకు పాలుపోవడంలేదట. ఈ కారణంతో, మరో పక్క రామ్ చరణ్ సినిమాలో వచ్చిన ఆఫర్ ని కూడా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితుల్లో తనుందని అంటున్నారు. పైకి మాత్రం 'దూకుడు" చాలా బాగా వస్తోందనీ, తనకు హ్యాట్రిక్ హిట్ ఫిలిం అవుతుందనీ చెబుతోంది సమంతా. ఏమైనా, 'బృందావనం" తర్వాత గ్యాప్ రావడంతో సమంతాకు ఇంతకు ముందున్న క్రేజ్ మాత్రం లేదిప్పుడు...!


Click it and Unblock the Notifications











