సమంత సినిమా కోసం 3కోట్ల విలువైన సెట్.. ఆ సినిమా కోసం స్టార్ హీరోల స్థాయిలో భారీగా..
గ్లామర్ బ్యూటీ సమంత గత కొంతకాలంగా విభిన్నమైన తరహాలో ప్రాజెక్టుల ఓకే చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత సమంత స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. వీలైనంత వరకు తన కెరీర్ ను మరో స్థాయికి తీసుకు వెళ్లాలని సమంత గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఇక సమంత ప్రత్యేకంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది ఇప్పటికే శాకుంతలం సినిమా పూర్తి చేసిన ఆమె మరొక విభిన్నమైన ప్రాజెక్టును కూడా సెట్స్ పైకి తీసుకు వచ్చింది. ఇక రీసెంట్ గా ఒక సినిమా కోసం నిర్మించిన సెట్ కోసం దాదాపు కోట్లల్లో ఖర్చు అయ్యిందట. ఆ వివరాల్లోకి వెళితే..

వరుస విజయాలతో..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సమంత ఇటీవల ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. రంగస్థలం సినిమా తర్వాత ఆమె స్థాయి మరింత పెరిగిందనే చెప్పాలి.అంతే కాకుండా మధ్యలో వచ్చిన ఓ బేబీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమెకు సినిమాలు చాలానే వస్తున్నాయి.

ఆమెజాన్ ప్రైమ్ లో..
ఇక సమంత తీసుకుంటున్న పారితోషికం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది వచ్చిన అమెజాన్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ సీజన్ 2 కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో కూడా సమంత మరొక బాలీవుడ్ ప్రాజెక్టు చేసేందుకు ఒప్పుకుంది. ప్రాజెక్టును కూడా అమెజాన్ ప్రైమ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

3కోట్ల విలువైన సెట్..
ఇక రీసెంట్ గా సమంత సినిమా కోసం ఏకంగా 3 కోట్ల రూపాయల భారీ సెట్‌ని వేశారట. సమంత నటిస్తున్న యశోద సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక రాబోయే షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను నిర్మించడంలో చిత్ర యూనిట్ సభ్యులు బిజీగా ఉన్నారు. సినిమాలో కీలకమయ్యే ఒక సెవెన్ స్టార్ హోటల్ తరహాలో విలాసవంతమైన సెట్‌ని నిర్మించారు. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ ఈ సెట్ ని సినిమాలో రియల్ గా ఉండేలా చూసుకుంటున్నారు.

స్టార్ క్యాస్ట్ తో యశోద మూవీ .
టాలెంటెడ్ దర్శక ద్వయం హరి హరీష్ దర్శకత్వం వహిస్తున్న యశోద ఒక న్యూ బైలాంగ్యువల్ థ్రిల్లర్. సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు.
Recommended Video

కేరళలో విహారయాత్ర
ఇక ప్రస్తుతం అయితే సమంత కేరళలో విహారయాత్రలో ఉంది. అక్కడ ఆమె ప్రకృతితో హ్యాపీగా సమయాన్ని గడుపుతోంది. కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక సమంత చేతిలో ప్రస్తుతం శాకుంతలం సినిమాతో పాటు బాలీవుడ్ లో ఒక ఆమెజాన్ వెబ్ ప్రాజెక్ట్ తో బిజీగా వుంది. మరి ఆ సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











