అటు పవన్, ఇటు ఎన్టీఆర్..గ్యాప్ ఇవ్వమంటూ గోల...
వరుస సక్సెస్ ల హీరోయిన్ గా పేరొందిన సమంత చర్మవ్యాధికి చికిత్స కోసం ఏడాది కిందట విశ్రాంతి తీసుకుంది. మళ్లీ ముఖానికి రంగేసుకున్నాక తమిళం, తెలుగు అంటూ విరామం లేకుండా నటిస్తూ వస్తోంది. ఏడాదిగా తనకు విశ్రాంతి అన్నదే లేదని, ఇందుకుతోడు ఎండలు చాలా ఇబ్బంది పెడుతున్నాయని వాపోతోంది. మరి దర్శకులు మాత్రం ఏం చేయగలం హీరోలు,డేట్స్ చాలా ప్లాబ్లం అని చేతులు ఎత్తేస్తున్నారు.
ప్రస్తుతం ఆమె ఇటు పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది, ఎన్టీఆర్ తో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పారితోషికం భారీగా పెంచినట్లు వార్తయి వచ్చాయి. వాటిని ఆమె ఖండిస్తోంది.
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. సమంత, శ్రుతిహాసన్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. అక్కడి ప్రధాన తారాగణంపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications












