తనకివ్వలేదని సమంత కోపం, పవన్ కళ్యాణ్‌కు లెటర్?

By Bojja Kumar

హైదరాబాద్: హీరోయిన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమ్మడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె పవన్ కళ్యాణ్‌పై చాలా కోపంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా పవన్ కళ్యాణ్‌కు లెటర్ రాయాలని నిర్ణయించుకుందట.

ఇంతకీ సమంత లెటర్ ఎందుకు రాయబోతోందో తెలుసా? మామిడి పళ్ల కోసమేనంట. పవన్ కళ్యాణ్ ప్రతి సంవత్సరం తన మామిడి తోటలోని పండ్లను తన సన్నిహితులకు పంపుతుంటారు. ఇటీవల నితిన్‌కు మామిడి పండ్లు అందడంతో ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

 Samantha wants mangoes from Pawan's farm

'అత్తారింటికి దారేది' చిత్రంతో పవన్ కళ్యాణ్‌తో సాన్నిహిత్యం ఏర్పరుచుకున్న సమంత....పవన్ కళ్యాణ్ తోట నుండి తనకు మామిడి పండ్లు రాకపోవడంపై అసంతృప్తిగా ఉందట. తనకూ మామిడి పండ్లు పంపాలని లెటర్ రాయాలని నిర్ణయించుకుందట. వినడానికి చాలా సిల్లీగా ఉంది కదూ.

మనకు ఇది వినడానికి సిల్లీగా అనిపించొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ సన్నిహితులు మాత్రం అలా కాదు. ఆయన నుండి మామిడి పళ్లు వచ్చాయంటే అదో గొప్పవిషయంగా భావిస్తున్నారు. అదన్నమాట సంగతి. మరి మామిడి పండ్ల సీజన్ చివరి దశకు చేరుకుంది. మరి పవన్ కళ్యాణ్ తోటలోని అమృత ఫలాలు సమంతకు అందుతాయో? లేదో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X