సమంత దూకుడు...ఈ సారి ఏకంగా కోటి
'దూకుడు" సినిమాలో మహేష్ బాబు సరసన అవకాశం దక్కించుకోవడం ఏమోగానీ....హీరోయిన్ సమంత ప్రవర్తనలో కూడా దూకుడు తనం పెరిగి పోయింది. నిన్న మొన్నటి వరకు సినిమా రూ. 40 నుంచి 60 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే ఈ భామ...దూకుడు సినిమా హిట్టయితే తన రెమ్యూనరేషన్ ను ఏకంగా రూ. కోటి రూపాయలకు పెంచే ఆలోచనలో ఉందట. గతంలో మహేష్ బాబు సరసన నటించిన పోకిరి సినిమా పెద్ద హిట్ కావడంతో ఇలియానా తన రేటు పెంచి సక్సెస్ అయిన నేపథ్యంలో....దూకుడు హిట్టయితే తను కూడా అదే రూట్లో వెళ్లి టాప్ హీరోయిన్ ఎదగాలని ఉవ్విల్లూరుతోంది.
వాస్తవానికి దూకుడు సినిమా అవాకాశం దక్కిన తర్వాత సంబర పడ్డ సమంత...షూటింగ్ సమయంలో ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నానా? అని బాధ పడిందట. దూకుడు ప్రమోషన్లలో మహేష్ బాబునే తప్పనను చూపించడమే తప్ప తనను ఎక్స్ ఫోజ్ చేయక పోవడము ఇందుకు కారణం. అయితే దూకడు అడియో రిలీజ్ తర్వాత నుంచి తన పేరు కూడా దూకుడు ప్రమోషన్లలో తన పేరు కూడా మారు మ్రోగు తుండటంతో సమంత అసంతృప్తి కాస్త సద్దు మనిగింది.


Click it and Unblock the Notifications











