For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Samantha Yashoda: లీకయిన 'యశోద' సినిమా కథ!.. అచ్చం సమంత జీవితంలా?

  |

  సమంత.. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే ఎనలేని స్టార్​ డమ్ ను సంపాదించుకుంది. అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే యూత్​లో మంచి క్రేజ్​ సంపాదించుకున్న సమంత లైఫ్​ను పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అంటూ పోల్చి చూడొచ్చు. సాధారణంగా పెళ్లిల్లు అయ్యాక హీరోయిన్లకు సినిమా అవకాశాలు అంతగా రావు. కానీ సమంత విషయంలో రాంగ్ అని ప్రూవ్ అయింది. ఎందుకంటే విడాకుల తర్వాత సమంత కెరీర్ తారా జువ్వలా దూసుకుపోతోంది. శాకుంతలం, యశోద చిత్రాలతోపాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అయింది ఈ బ్యూటి. అయితే తాజాగా సమంతో మూవీ స్టోరీ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

  అంతగా సక్సెస్ కాలేదు..

  అంతగా సక్సెస్ కాలేదు..

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్, బ్యూటిఫుల్ సమంత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. సమంత నటించిన సినిమాలు ఎప్పుడెప్పుడూ విడుదల అవుతాయా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత వచ్చిన కణ్మనీ రాంబో ఖతీజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది అంతగా సక్సెస్ ఇవ్వలేదు. మరోసారి మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది సమంత. ప్రస్తుతం సమంత చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పౌరాణిక నేపథ్యంతో శాకుంతలం సినిమా తెరకెక్కగా.. లేడి ఒరియెంటెడ్ గా యశోద మూవీ రానుంది. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే బజ్ క్రియట్ చేసింది.

  కథ గురించి పలు లీకులు..

  కథ గురించి పలు లీకులు..

  ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ యశోద చిత్రంపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ మూవీ శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తుండగా.. హరి-హరీశ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇటీవల ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్ లో సమంత.. గర్భవతిగా కనిపిస్తోంది. అయితే ఈ మూవీ గురించి ప్రస్తుతం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అది ఏంటంటే ఈ మూవీ కథ. ఈ సినిమా కథ గురించి పలు లీకులు వస్తున్నాయి. ఇందులో ఓ భాగంగానే ఓ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

  మెడిసిన్ కోసం విదేశాలకు సమంత..

  మెడిసిన్ కోసం విదేశాలకు సమంత..

  ఒక వ్యక్తి మొహానికి రాసుకునే క్రీమ్ కనిపెడతారు. ఆ క్రీమ్ అంటే మెడిసిన్ రాసుకుంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తులుగా కనిపిస్తారు. ఈ మెడిసిన్ వాడిన మనిషిలో అనేక వింత మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ పరిణామాలతో స్టోరీ ఆద్యంతం ఉత్కంఠంగా ఉంటుందని సమాచారం. అలాగే ఈ మెడిసిన్ కోసం సమంత విదేశాలకు వెళ్తుందట. స్కిన్ సమస్యతో బాధపడే సమంత ఆ మెడిసిన్ కోసం ఫారెన్ వెళ్లి చిక్కుల్లో పడిపోతుందని టాక్ వినిపిస్తోంది. అయితే సరిగ్గా ఇలానే సమంత తన నిజ జీవితంలో కూడా స్కిన్ ప్లాబ్లమ్స్ ఫేస్ చేసిందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. ఇటీవల కూడా తను చర్మ వ్యాధితో బాధపడుతోందని, అందుకే చికిత్స కోసం విదేశాలకు వెళ్లిందని వార్తలు వచ్చాయి. అయితే అదంతా పుకార్లు అని సమంత టీమ్ తేల్చి చెప్పింది. కానీ ఇప్పుడు యశోద స్టోరిని సమంత రియల్ లైఫ్ కు లింక్ పెట్టి వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

  English summary
  Tollywood Star Heroine Samantha Starrer Yashoda Movie Story Is Leaked And Looks Like Samantha Real Life
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X