twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టక్ జగదీష్ - లవ్ స్టోరీ మళ్ళీ అదే కన్ఫ్యూజన్.. ఆశలు వదులుకోవాల్సిందేనా?

    |

    కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల సినిమా బిజినెస్ కు దెబ్బ పడిందనే చెప్పాలి. ఒకవైపు థియేట్రికల్ బిజినెస్ లేదు. మరోవైపు సినిమాల రిలీజ్ డేట్స్ లో కన్ఫ్యూజన్ నెలకొనడం వలన దాదాపు రెండేళ్ల సమయం అయితే వృధా అయ్యింది. ఈ నెలలో రావాల్సిన సినిమాలు కూడా ఒక్కసారిగా సంక్రాంతికి జంప్ అయ్యాయి. దీంతో ఎటు తేల్చుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

    ఇక సెకండ్ వేవ్ అనంతరం చిన్న బడ్జెట్ సినిమాలు మెల్లగా థియేటర్స్ లోకి రావడానికి సిద్ధమయ్యాయి. ఇష్క్ - తిమ్మారుసు కొంచెం హడావుడిగానే రిలీజ్ అయ్యాయి గాని సినిమాల కలెక్షన్స్ మాత్రం చాలా తక్కువగానే వచ్చాయి. జనాలు ఇంకా సినిమాల వైపు పూర్తి స్థాయిలో మొగ్గు చూపలేదని అర్ధమవుతొంది. అసలు మ్యాటర్ లోకి వస్తే మీడియం బడ్జెట్ సినిమాలు ఇప్పట్లో రానట్లే అని టాక్ వస్తోంది.

    Same confusion on Tuck jagadeesh and love story release dates

    టక్ జగదీష్ సినిమా మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని శివ నిర్వణ కాంబినేషన్ లో వస్తున్న ఆ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే తెలంగాణలో అంతా బాగానే ఉన్నప్పటికీ ఏపీలో ఇంకా టికెట్ల రేట్ల విషయంలో ఎటు తేలడం లేదు. ఆ రేట్లతో థియేటర్స్ బిజినెస్ ఏ మాత్రం లాభదాయకంగా ఉండదని చాలామంది నష్టపోవాల్సి ఉంటుందని ఇప్పటికే సినీ పెద్దలు ప్రభుత్వ అధికారులను కలిశారు. కానీ వారికి ఎలాంటి సమాధానం దొరకలేదు.

    ఆ ఎఫెక్ట్ కారణంగా టక్ జగదీష్ తో పాటు లవ్ స్టొరీ సినిమా కూడా సందిగ్ధంలో పడింది. గత ఏప్రిల్ లోనే రావాల్సిన ఈ సినిమాలు ఆగస్ట్, సెప్టెంబర్ లో కూడా రావడం కష్టమేనని టాక్ వస్తోంది. అంతే కాకుండా కరోనా కేసులు కూడా మళ్ళీ ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్లు అర్ధమవుతోంది. దీంతో జనాలు థియేటర్స్ కు రావడం అనుమనంగానే ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కలిసి రావడం ఇప్పట్లో జరిగేలా లేదు. అందుకే టక్ జగదీష్ - లవ్ స్టొరీ సినిమాలు మరోసారి వాయిదా పడవచ్చని టాక్ వస్తోంది. మరి పరిస్థితులు ఎప్పుడు అనుకూలిస్తాయో చూడాలి.

    English summary
    Sekhar Kammula's filming at the national level has become a hot topic to expand his range like never before. He is all set to make a film in Telugu, Tamil and Hindi near Pan India. It seems that there is a possibility of selecting Sai Pallava once again in the big budget movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X