బాలీవుడ్ ముమైత్ ఖాన్ అయిపోయిన జూ ఎన్టీఆర్ ప్రియురాలు..!
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ ముమైత్ ఖాన్ తెలుగు తెరను ఒక్కసారిగా ఊపేసింది. పోకిరి సినిమాతో ఫేం అయిన ముమైత్ ఇక చూపించేందుకు ఏమి మిగల లేదు అనే స్టేజికి వెళ్లింది. ఇప్పడు ముమైత్ ఖాన్ వారసురాలిగా సమీరా అవతారం ఎత్తింది. అయితే తెలుగులో కాదు...హిందీలో.
బాలీవుడ్ తెరపై హీరోయిన్ గా సరైన స్టార్ డమ్ రాకపోవడంతో సమీరా రెడ్డి ఐటమ్ గర్ల్ గా మారిపోయింది. తెలుగులోనూ అశోక్, జై చిరంజీవ సినిమాలతో దురదష్టాన్నే చవి చూసింది. ఇటూ సౌత్ లోనూ, అటూ నార్త్ లోనూ హీరోయిన్ గా నిలదొక్కుకోవడం కష్టమని భావించిన సమీరా రెడ్డి హిందీ సినిమాల్లో ముమైత్ ఖాన్ వారసురాలిగా ముందుకొచ్చింది. అజయ్ దేవగన్, అక్షయ్ ఖన్నా నటించిన ఆక్రోష్ సినిమాలో సమీరా ఐటమ్ సాంగ్ లో నర్తించింది. ముమైత్ ఖాన్ కంటే కాస్త ఎక్కువగానే అందాలు ఆరబోసిందట. మరి ఇప్పుడైనా ఈ సమీరా కు కలిసి వస్తుందో లేదో చూద్దాం.
సమీరా రెడ్డి అశోక్ జై చిరంజీవ ఆక్రోష్ అజయ్ దేవగన్ అక్షయ్ ఖన్నా ముమైత్ ఖాన్ sameera reddy ashok jai chiranjeeva aakrosh ajay devagan akshay khanna mumaith khan


Click it and Unblock the Notifications