చంధ్రముఖి సీక్వెల్ లో హీరోయిన్ ఆమే!?
చంద్రముఖి సీక్వెల్ గా పి.వాసు దర్శకత్వంలో కన్నడంలో వచ్చి హిట్టైన 'ఆప్తరక్షక' చిత్రం త్వరలో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో పాత్రకు రజనీకాంత్ ని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ సరసన హీరోయిన్ గా ఎవరు చేస్తారన్న దానికి సమీరా రెడ్డిని ఆప్షన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నయ్‌లో రజనీకాంత్‌కు ఆప్తరక్షక్‌ను చూపించి ఓరల్‌గా రజనీ అనుమతిని కూడా పొందిన పి.వాసు రజనీ కేరక్టర్ ఏ రకంగా ఉంటుందో కొన్ని స్కెచ్‌లు కూడా తయారు చేసి, ఆయనకు చూపించే దశలో ఉన్నారు. అలాగే రజనీ సరసన కేరక్టరుకు సమీరారెడ్డిని అనుకోవడమే కాకుండా ఆమె రూపానికి చెందిన స్కెచ్‌లను కూడా జతచేసి చూపించాలనుకుంటున్నారని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది..ఈ విషయమై సమీరారెడ్డితో వాసు చర్చలు జరుపుతున్నట్లు కూడా సమాచారం. ఇక ప్రస్తుతం రజనీకాంత్ తాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 'రోబో' పై దృష్టి పెట్టారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఈ వేసవికి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సమీరారెడ్డి...తనకు సూపర్ స్టార్ రజనీ ప్రక్కన ఆఫర్ రావటాన్ని ఓ ప్రమేషన్ గా భావిస్తోందని చెప్తున్నారు. తెలుగులో ఆప్తరక్షక రీమేక్ రైట్స్ ని బెల్లంకొండ సురేష్ తీసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











