సమీరా రెడ్డిని వదలని ఎన్టిఆర్..
సమీరా రెడ్డిపై ఎన్టీఆర్ కి మోజు ఇంకా పోలేదంటున్నారు సినీ వర్గాలు. తాజాగా ఎన్టీఆర్ ఆమెను తన కొత్త చిత్రంలో హీరోయిన్ గా రికమెండ్ చేసాడని, దర్శక, నిర్మాతల నుండి దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించే చిత్రంలో ఈ భామను తీసుకోవటానికి నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో ఇలియానా బుక్కయిందని రెండో హీరోయిన్ గా సమీరాను తీసుకోవటం జరిగిందని అంటున్నారు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రం నుంచి సమీరా దక్షిణాది బాషల్లో నటించటానికి ఆసక్తి చూపుతోంది. ఆ సినిమాలో ఆమె పాత్రను చూసిన ఎన్టీఆర్ ఆమెకు పర్శనల్ గా ఫోన్ చేసి మెచ్చుకున్నాడని, అప్పుడామె మళ్ళీ తెలుగులో చెయ్యాలన్న కోరిక వ్యక్తపరిచిందని సమాచారం.
ఇక ఎన్టీఆర్,సమీరా రెడ్డి మధ్యన ఎఫైర్ నడిచిందంటూ ఆ మధ్య కంటిన్యూగా వార్తలు వెలబడ్డాయి. అశోక్ ఫ్లాఫ్ అనంతంరం ఆ కథలు వినపడటం ఆగాయి. అయితే ఎన్టీఆర్ ఆమెతో చేసిన నరసింహుడు, అశోక్ రెండూ ఫెయిల్యూర్ కావటం, సూర్య సన్నాఫ్ కృష్ణన్ కూడా వర్కవుట్ కాకపోవటం దర్శకుడుని కాస్సేపు ఆలోచించేలా చేసినా ఎన్టీఆర్ రికమెండేషన్ ముందు అవేమీ నిలవలేదంటున్నారు.ఇక డిఫెరెండ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ చిత్రంలో ఎన్టిఆర్ పాత్ర ఎడ్వంచర్స్ చేస్తుందని తెలుస్తోంది. ఇక మెహర్ రమేష్ తన కంత్రి,భిల్లా నడవకపోయినా మరోసారి ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వటంపై ఉత్సాహంగా ఉన్నాడు. మొదట వెంకటేష్ కి వినిపించిన ఈ కథ అక్కడ లేటయ్యేటట్లు ఉండటంతో అశ్వనీదత్ కి వినిపించి ఓకే చేయించుకున్నాడని సమాచారం. అలాగే ఎన్టీఆర్ సైతం అశ్వనీదత్ తమ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు దృష్టిలో పెట్టుకుని తను కమిటయిన నల్లమలుపు బుజ్జి ప్రాజెక్టుని సైతం ప్రక్కన పెట్టి దీనికి ప్రయారిటి ఇచ్చారని చెప్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా సమీరా మళ్ళీ తెలుగు తెరపై తన అందాలను ఆరబోయనుంది.


Click it and Unblock the Notifications











