బాలకృష్ణతో చిరు హీరోయిన్ చిందులు ఖరారు
ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకుడు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్. జగపతిబాబు విలన్ గా నటిస్తున్నారు అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట, సాయికొర్రపాటి నిర్మాతలు. ఇటీవల బాలకృష్ణ పై గుర్రపుస్వారీ నేపథ్యంలో పోరాట సన్నివేశాలు తెరకెక్కించారు. కొన్ని సాహసోపేతమైన దృశ్యాల్లో బాలకృష్ణ డూప్ లేకుండా నటించారట. ఈ చిత్రానికి 'లెజెండ్' అనే పేరు పరిశీలిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతందిస్తున్నారు.
జనవరిలో బాలకృష్ణ, చిత్ర హీరోయిన్స్ తో పాటు ఓ గెస్ట్ హీరోయిన్ పై చిత్రీకరించే పాట ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనుందని తెలుస్తోంది. పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని చెప్పుకుంటున్నారు.
ఈ చిత్రంలో బాలకృష్ణ సరికొత్తగా కనిపిస్తారు. ఆయన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బుల్లెట్ బైక్, సఫారీ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సినిమా షూటింగ్ మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం, అందుకు బాలకృష్ణ కూడా ఎంతగానో సహకరిస్తున్నారని చిత్ర నిర్మాతలు తెలిపారు. దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ...'ఈచిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు ఉండటం సహజం. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఈచిత్రం రూపుదిద్దుకుంటోంది' అన్నారు.


Click it and Unblock the Notifications












