అలా చేస్తే కనిపించేది రవితేజ కాదు, పవన్ కళ్యాణే!
హైదరాబాద్: రామ్ చరణ్‌తో ‘రచ్చ' సినిమా చేసి హిట్టు కొట్టగానే పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్-2' చేసే అవకాశం దక్కించుకున్న సంపత్ నందికి ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఇటు పవన్ ప్రాజెక్టు మొదలు కాక, ఇటు వేరే సినిమాలు కమిట్ కాక చాలా నష్టపోయాడు సంపత్ నంది.
ఎట్టకేలకు వాస్తవం తెలుసుకుని...రవితేజతో సినిమాకు రెడీ అయ్యాడు. ఈ చిత్రంలో సంపత్ నంది ....రవితేజ పేరు బెంగాల్ టైగర్ సిద్ధు సిద్దార్ధ్ రాయ్ అని పెట్టబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి వార్తలో నిజం ఎంతో తెలియదు కానీ.....అలా చేస్తే మాత్రం రవితేజకు బదులు తెరపై పవన్ కళ్యాణే కపిస్తాడు. ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే విమర్శలు ఖాయం.

గత కొంతకాలంగా సంపత్ నంది, పవన్ కళ్యాణ్ ల గబ్బర్ సింగ్ 2 ఉందా లేదా అన్న విషయం హాట్ టాపిక్ గా సినిమా సర్కిల్స్ లో నలుగుతూ వస్తోంది. అయితే రీసెంట్ గా జరిగిన పరిణాలతో ఓ క్లారిటీ వచ్చినట్లైంది. సంపత్ నంది...తను రవితేజతో చిత్రం ఎనౌన్స్ చేసేసాడు. దాంతో అందరికీ గబ్బర్ సింగ్ 2 ని సంపత్ నంది డైరక్ట్ చేయటం లేదని క్లారటీ వచ్చేసింది. ఈ నేపధ్యంలో ఇంత ఇమ్మిడియట్ గా రవితేజతో ఎనౌన్స్ చేయటం వెనక కారణం..డామేజ్ కంట్రోలే అంటున్నారు. పవన్ తో చిత్రం అనుకుని రెండేళ్లు పాటు స్క్రిప్టు వర్క్ చేసిన సంపత్ దాంతో పవన్ ని ఇంప్రెస్ చేయలేకపోయారనేది స్పష్టం అయ్యింది. దాంతో రచ్చ తర్వాత రెండేళ్లు గ్యాప్ వచ్చేసింది. ఇమ్మీడియట్ గా ప్రాజెక్టు మొదలెట్టినా అది మెటీరియలైజ్ అయ్యేసరికి ఆరు నెలలు పైగానే టైమ్ పడుతుంది. ఈ నేఫధ్యంలో తనపై మీడియాలో..పవన్ చేత రిజెక్టు చేయబడిన డైరక్టర్ అంటూ వార్తలు రాకుండా ఉండేందుకు..రవితేజ తో ప్రాజెక్టు ఎనౌన్స్ చేసాడంటున్నారు.


Click it and Unblock the Notifications











