పవన్ కళ్యాణ్‌తో సంపత్ నంది ప్రాజెక్టు క్లోజ్?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సంపత్ నంది ప్రాజెక్టు లేననట్లేనని అంటున్నారు. గబ్బర్ సింగ్ 2 సినిమాను పవన్ కళ్యాణ్ సంపత్ నందితో చేయాలని అనుకోవడం లేదని చెబుతున్నారు. దర్శకుడు సంపత్ నంది వినిపించిన కథ ఆయనకు నచ్చలేదని అంటున్నారు.
అదే సమయంలో మెహర్ రమేష్ నెరేషన్‌కు పవన్ కళ్యాణ్ పడిపోయాడని అంటున్నారు. అయితే, మెహర్ రమేష్‌తో చేయడం పవన్ కళ్యాణ్ సన్నిహితులకు కొంత మందికి నచ్చడం లేదని అంటున్నారు. అయితే, స్క్రిప్టులో లోపాలను తాను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటానని, భయాలు అక్కర్లేదని పవన్ కళ్యాణ్ వారికి చెబుతున్నట్లు సమాచారం.
కథను వినిపించడంలో కొంత మంది దర్శకులు అంతగా ముగ్ధులను చేయలేరని, కానీ సినిమా తీయడంలో తమ ప్రతిభను కనబరుస్తారని అంటున్నారు. సంపత్ నంది నేరేషన్ సరిగా లేకపోయినా సినిమా బాగా తీయగలడని అంటున్నారట.
సంపత్ నందిని నమ్ముకుంటూనే మంచిదనే అభిప్రాయం పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు అంటున్నారట. ఆయనను దూరం చేసుకోవడం మంచిది కాదని కాదని కూడా అంటున్నారట. మరి, పవన్ కళ్యాణ్ వారి మాటలను వింటాడో, లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











