ఎందుకైనా మంచిదని సంపూర్ణేష్ బాబు ని కూడా...

By Srikanya

హైదరాబాద్: వరస ఫ్లాపుల్లో ఉన్నవారు తమ తదుపరి చిత్రం కోసం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూంటారు. ప్రస్తుతం అల్లరి నరేష్ పరిస్ధితి అలాగే ఉంది. రీసెంట్ గా వచ్చిన జంపు జిలాని చిత్రం సైతం భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలనే పట్టుదలతో నరేష్ ఉన్నారు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో,ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ చేయటం మొదలెట్టారు అల్లరి నరేష్. అందుకోసం తన చిత్రంలో నటించే ప్యాడింగ్ విషయంలోనూ ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆయన చిన్నికృష్ణ తో చేస్తున్న తన తాజా చిత్రం లో సంపూర్ణేష్ బాబు కి ఓ కీలకమైన పాత్ర చేయనున్నారని సమాచారం.

ఈ మేరకు సంపూర్ణేష్ బాబుతో మాట్లాడారని తెలుస్తోంది. నెట్ జనులలో క్రేజ్ తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు తో ఓ వర్గాన్ని ఇట్టే ఆకట్టుకోవచ్చు అని, సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో తమ చిత్రానికి ఉచిత ప్రచారం జరిగే అవకాసం ఉందని సంపూర్ణేష్ బాబుని తెచ్చుకున్నట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సంపూర్ణేష్ బాబుని ఓ కీలకమైన పాత్రలో ఈ చిత్రంలో చూపించనున్నారని, సంపూకి, నరేష్ కి మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా ఉంటాయని అంటున్నారు. ఈ చిత్రంతో సంపూర్ణేష్ బాబుకి తెలుగు చిత్ర పరిశ్రమలో సెటిల్ అయినట్లే అని అతని అభిమానులు అంటున్నారు.

Sampoornesh Babu in Allari Naresh’s film

మరో ప్రక్క ఈ చిత్రం కోసం... నాగ చైతన్య తో జోష్, ఎన్టీఆర్ తో దమ్ము చిత్రాలు చేసిన కార్తీక తాజాగా చెల్లిలి పాత్ర కమిటై అందరినీ షాక్ కు గురి చేసింది. అదీ అల్లరి నరేష్ నటించే కామెడీ సినిమాలో అనే సరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీడు తేడా దర్శకుడు చిన్ని కృష్ణ దర్శకత్వంలో అమ్మిరాజు నిర్మిస్తున్న ఎంటర్టైనర్ లో ఆమె కీలక మైన పాత్రకు ఎంపికైంది. విలన్ ని ప్రేమించే పాత్రలో ఆమె కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఎడ్వెంచర్స్ చేస్తుందని తెలుస్తోంది. అలాగే నరేష్ సరసన మోనాల్ గజ్జల్ కనిపించనుంది.

కామెడీ చిత్రాలు అంటే భాక్సీఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ చిత్రాలు అనే ముద్ర ఉంది. అందులోనూ ఈ మధ్య కాలంలో కామెడీ చిత్రాలకు మరింత ఆదరణ పెరిగింది. ముఖ్యంగా అల్లరి నరేష్ చిత్రాలకు అంటే బయ్యర్లు కళ్ళు మూసుకుని కొనేసారు. అయితే ఇప్పుడు ఇదే హీరో చిత్రాలు అంటే భయపడి పరారవుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. నరేష్ సినిమాలు వరసగా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటం కారణంగా చెప్తున్నారు. జంప్ జిలాని సైతం నిరాశపరచటంతో పూర్తిగా నరేష్ పై హోప్స్ పోయాయని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X