మరో సంచలనానికి సిద్ధమైన సంపూర్ణేశ్ బాబు.. ఈ సారి అంతకు మించి.. ఎవరితోనో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి అనూహ్య పరిస్థితుల్లో పరిచయమై, విచిత్రమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు. ఆయన ఇటీవల 'కొబ్బరి మట్ట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించారు. ఇషికా సింగ్, గీతాంజలి, గాయత్రి గుప్తా, కత్తి మహేష్, షకీలా తదితరులు నటించారు. అలాగే, ఈ సినిమాకు సయ్యద్ కమ్రాన్ సంగీతం అందించగా, ముజీర్ మాలిక్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు.

విడుదలకు ముందు వచ్చిన భారీ డైలాగ్, ట్రైలర్, పాటల వీడియోలతో 'కొబ్బరి మట్ట'కు ఊహించని రీతిలో హైప్ క్రియేట్ అయింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే, సినీ విమర్శలకులు సైతం ఈ సినిమాకు మంచి రేటింగ్ ఇచ్చారు. దీంతో కలెక్షన్ల పరంగానూ 'కొబ్బరి మట్ట' దూసుకుపోతోంది. దీంతో చిత్ర యూనిట్ సంబరపడిపోతోంది.

Sampoornesh Babu Reunion With Kobbari Matta Team

'కొబ్బరి మట్ట' మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 62 లక్షల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 63 లక్షల షేర్ సాధించింది. మూడో రోజుకే రూ. 3 కోట్ల మైలురాయిని దాటింది. ఆ తర్వాత కూడా కొద్దిరోజుల పాటు ఈ సినిమా మంచి టాక్‌తో ప్రదర్శితమైంది. ఈ సినిమా విజయంతో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

'కొబ్బరి మట్ట' దర్శక నిర్మాతలు సంపూర్ణేశ్ బాబుతో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా కూడా కామెడీ ప్రధానాంశంగానే తెరకెక్కబోతుందని తెలుస్తోంది. ఇందులో 'కొబ్బరి మట్ట'కు మించిన ఎలిమెంట్స్ ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X