twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవితరాజశేఖర్ లకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్...?

    By Sindhu
    |

    జీవిత అంటే రాజశేఖర్, రాజశేఖర్ అంటే జీవిత అనే విధంగా ఉంటున్నారు ఈ జీవిత రాజశేఖర్ దంపతులు. రాజశేఖర్ నంటించే ప్రతి చిత్రంలో కూడా వేలు పెట్టి గెలికేడం జీవితకు అలవాటే. గతంలో ప్రముఖ దర్శకడు సముద్ర దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా సింహరాశి, 'ఎవడైతే నాకేంటి" వంటి చిత్రాలు వచ్చాయి. ఇటీవలే విడుదలైన 'ఎవడైతే నాకేంటి" చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఈ విజయంలో దర్శకుడు సముద్రకు పలు సూచనలు ఇచ్చాను అంటూ దర్శకత్వం జాబితా లిస్ట్లో జీవిత తన పేరును కూడా చేర్చేసుకుంది.

    కథలో ఇంటర్ ఫియర్ అయితే దర్శకులకు కోపం వస్తుంది. అలాంటి కథతో పాటుగా దర్శకత్వం బాధ్యతతో కూడా ఇంటర్ ఫియర్ అయ్యి వచ్చిన పేరును కాస్త కొట్టేస్తే ఎంత కోపం వస్తుందో ఒకపారి ఆలోచించండి. అంతే రేంజ్ లో దర్శకడు సముద్రకు కోపం వచ్చి, ఇంకోసారి రాజశేఖర్ తో సినిమాతో తీయవద్దని నిర్ణయించుకున్నాడు. అయితే ప్రస్తుతం రాజశేఖర్ ను హీరోగా పెట్టి సినిమాలు తీయాలంటేనే భయపడి పరుగులు తీస్తున్నారు దర్శక, నిర్మాతలు.

    అయితే నీతో సినిమా చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ కథలో, దర్శకత్వంలో బాధ్యతలో ఇంటర్ ఫియర్ కాకుడదంటూ, సెట్ లో జీవిత రాకూడదంటూ దర్శకుడు సముద్ర తెగేసి చెప్పేశాడంట. దాంతో ఏం చేయలేక రాజశేఖర్ ఒప్పుకున్నాడని సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో సినిమాలు విజయం సాధించడమే గొప్ప విషయంగా మారుతుంటే అలాంటిది దర్శకుడు చాలా కష్టపడి తయారు చేసుకున్న కథలో ఇంటర్ ఫియర్ అయ్యి దాన్ని చెడగొడుతుంటే ఏ డైరెక్టర్ కి మాత్రం కోపం రాకుండా ఉంటుంది.

    English summary
    Finally, director Samudra known for popular hits ‘Simha Raasi’ and ‘Evadaithe Naakenti’ with rajasekhar has prepared a new story and script for his hero. More to rejoice is, Samudra has also caught a producer to invest on this venture. Samudra has strictly warned the hero that he would not tolerate Jeevita putting her finger either in the story or direction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X