మహేష్ బాబు నో చెప్పిన కథను సందీప్ రెడ్డి వంగా ఇలా ప్లాన్ చేశాడా?

తెలుగు సినిమా రంగం నుంచి వెలుగులోకి వచ్చిన మరో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. 'అర్జున్ రెడ్డి' సినిమాతో తన ప్రస్థానం మొదలు పెట్టిన సందీప్ రెడ్డి తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఇదే చిత్రాన్ని హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేయడం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్లు వసూలు చేయడంతో ఏ లిస్ట్ బాలీవుడ్ స్టార్స్, నిర్మాతుల ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సందీప్ రెడ్డి త్వరలో బాలీవుడ్లో 'డెవిల్' అనే చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

నెక్ట్స్ మూవీ రణబీర్ కపూర్‌తో?

నెక్ట్స్ మూవీ రణబీర్ కపూర్‌తో?

‘కబీర్ సింగ్' తర్వాత సందీప్ రెడ్డి వంగా ‘డెవిల్' పేరుతో చేయబోయే చిత్రం డార్క్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్టుతో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కథను రణబీర్ కపూర్‌కు వినిపించాడని, అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలో ప్రాజెక్ట్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు టాక్.

Recommended Video

Mahesh Babu About His Health Problem || సీక్రెట్ చెప్పి షాకిచ్చిన మహేష్ బాబు
మొదట డెవిల్ కథ మహేష్ బాబుకు చెప్పాడు కానీ...

మొదట డెవిల్ కథ మహేష్ బాబుకు చెప్పాడు కానీ...

వాస్తవానికి ‘డెవిల్'కథను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెప్పారట సందీప్ రెడ్డి. అయితే డార్క్ క్రైమ్ సబ్జెక్ట్ కావడంతో చేయడానికి మహేష్ బాబు ఆసక్తి చూపలేదట. మరో కథతో రమ్మని సూచించడంతో అదే కథను రణబీర్ కపూర్‌కు చెప్పి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది

మహేష్ బాబు ఆసక్తిగా ఉన్నారు కానీ...

మహేష్ బాబు ఆసక్తిగా ఉన్నారు కానీ...

సందీప్ వంగతో సినిమా చేయడానికి మహేష్ బాబు ఆసక్తిగానే ఉన్నారు, అదే సమయంలో సందీప్ రెడ్డిలో కూడా సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేయాలనే ఉత్సుకత ఉంది. అయితే తన అభిరుచి, తన ఫ్యాన్స్, ఆడియన్స్ టేస్టుకు తగిన కథ అయితే బావుంటుందని మహేష్ బాబు సూచించారట.

డెవిల్ మొదలయ్యేదెప్పుడు?

డెవిల్ మొదలయ్యేదెప్పుడు?

ప్రస్తుతం రణబీర్ కపూర్... అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘బ్రహ్మాస్త్ర' చిత్రం చేస్తున్నారు. దీంతో పాటు శంషీరా చిత్రంలో సంజయ్ దత్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు 2020లో విడుదల కానున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత రణబీర్ కపూర్ మూవీ ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X