రూటు మార్చిన ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్... మహేష్ బాబు సినిమా పక్కన పడేశాడా?

గట్టిగా ఒక్క సినిమా పడితే చాలు... లైఫ్ మారిపోతుంది అనే విషయాన్ని సినిమా పరిశ్రమలో బాగా నమ్ముతారు. ఈ నమ్మకంతోనే చాలా మంది ఏళ్ల తరబడి వెయిట్ చేస్తుంటారు. కొందరికి ఈ అవకాశం త్వరగా వస్తే, మరికొందరికి కాస్త ఆలస్యం అవుతుంది.... కొందరికి అసలే రాకపోవచ్చు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విషయంలో మాత్రం ఇది చాలా స్పీడుగా వచ్చేసింది.

'అర్జున్ రెడ్డి' రూపంలో తొలి సినిమాకే సంచలన విజయం అందుకున్న సందీప్ రెడ్డి... వెంటనే ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. 'కబీర్ సింగ్' పేరుతో షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దీంతో సందీప్ రెడ్డితో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి.

Sandeep Reddy postponed his thoughts on making a film with Mahesh Babu?

బాలీవుడ్ చిత్ర సీమలో కెరీర్ అవకాశాలు బావుండటంతో సందీప్ రెడ్డి ముంబైలోనే ఆఫీస్ ఓపెన్ చేశాడు. దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా డిమాండ్ ఉన్నపుడే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. త్వరలో మరో బలీవుడ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

'అర్జున్ రెడ్డి' విజయం తర్వాత మహేష్ బాబు ఈ దర్శకుడి కథ వినేందుకు ఆసక్తి చూపారు. ఆ మధ్య మహేష్ బాబును కలిసిన సందీప్ రెడ్డి తన వద్ద ఉన్న స్టోరీ లైన్ వినిపించారు. అయితే పూర్తి స్క్రిప్టు విన్న తర్వాతే చేయాలా? వద్దా? అనే విషయమై నిర్ణయం తీసుకుంటానని, పూర్తి స్క్రిప్టుతో రమ్మని చెప్పారట.

ఈ లోపే హిందీలో 'కబీర్ సింగ్' మూవీ చేసే అవకాశం రావడంతో బాలీవుడ్ వెళ్లిన సందీప్ రెడ్డి వంగా... మహేష్ బాబు కోసం స్క్రిప్టు సిద్ధం చేసే పని వాయిదా వేసుకున్నాడు. కబీర్ సింగ్ రిలీజ్ తర్వాత దీన్ని పూర్తి చేద్దామనుకున్నాడు.

అయితే ఊహించని విధంగా 'కబీర్ సింగ్' భారీ విజయం అందుకుంది. బాలీవుడ్ టాప్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఎఫెక్టుతో తమతో సినిమా చేయాలని బాలీవుడ్ నిర్మాతల నుంచి
సందీప్ మీద ప్రెషర్ పెరుగుతుండటంతో అందుకు సంబంధించిన పనుల్లో నిమగ్నమైన ఈ యువ దర్శకుడు.... మహేష్ బాబు సినిమా పక్కన పెట్టేశాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X