మహేష్‌తో సినిమాకు సందీప్ రెడీ.. కానీ?: ఇదీ లేటెస్ట్ అప్‌డేట్..

Recommended Video

మహేష్‌-సందీప్ వంగా మూవీ లేటెస్ట్ అప్‌డేట్..!

ఎంట్రీతోనే టాలీవుడ్‌ను షేక్ చేసి పారేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. రొటీన్, మూస కథలతో మొహమొత్తిన ప్రేక్షకులకు తెరపై 'అర్జున్ రెడ్డి'ని చూపించి థ్రిల్ చేశాడు.

ఈ ఒక్క సినిమాతోనే అటు బాలీవుడ్, కోలీవుడ్ లోనూ తన గురించి చర్చించుకునేలా చేశాడు. అదే సమయంలో స్టార్ హీరోల నుంచి ఆఫర్స్ కూడా అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్‌తో మూవీకి డీల్ ఓకె అయిందన్న వార్తలు వస్తున్నాయి..

ప్రస్తుతం ఆ పనిలో:

ప్రస్తుతం ఆ పనిలో:

ప్రస్తుతం అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు సందీప్. అర్జున్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన మహేష్ తో సినిమాను పట్టాలెక్కిస్తారని టాక్.

 మహేష్ బిజీ..:

మహేష్ బిజీ..:

ప్రస్తుతం మహేష్ కూడా భరత్ అనే నేను సినిమాతో బిజీగా ఉన్నాడు. వేసవిలో ఈ సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత వంశీ పైడిపల్లి ప్రాజెక్టును కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.

 వెయిటింగ్ లిస్టులో పెట్టడంతో..:

వెయిటింగ్ లిస్టులో పెట్టడంతో..:

నిజానికి మహేష్ తో సినిమాకు సందీప్ సిద్దంగానే ఉన్నప్పటికీ.. అప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టుల రీత్యా మహేష్ ఆయన్ను వెయిటింగ్ లిస్టులో పెట్టక తప్పలేదు. దీంతో ఈలోగా బాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' రీమేక్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాడట.

 నమ్రతతో చెప్పిన సందీప్..:

నమ్రతతో చెప్పిన సందీప్..:

మహేష్ తో సినిమాకు మరో ఏడాది పట్టే అవకాశం ఉండటంతో.. ఆలోగా బాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' రీమేక్ చేస్తానని ఇటీవలే నమ్రతతో సందీప్ చెప్పినట్లు తెలుస్తోంది. నమత్ర కూడా ఇందుకు ఓకె చెప్పడంతో ప్రస్తుతం సందీప్ ఆ పనుల్లో ఉన్నట్లు సమాచారం.

 మహేష్‌కు హిట్ కావాలి:

మహేష్‌కు హిట్ కావాలి:

బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోవడంతో.. మహేష్‌కు అర్జెంటుగా ఇప్పుడొక హిట్టు కావాలి. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న 'భరత్ అనే నేను'పై ఆ లోటును తీరుస్తుందని మహేష్ నమ్మకంగా ఉన్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఆ టైమ్ లోనే:

ఆ టైమ్ లోనే:

'అర్జున్ రెడ్డి' సినిమా విడుదలయినప్పుడే మహేష్ బాబు ప్రత్యేకంగా ఆ టీమ్ ను అభినందించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు సందీప్ వంగాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ అభినందించారు. ఆ సమయంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

 'మహేష్'ని ఎలా చూపిస్తాడో..:

'మహేష్'ని ఎలా చూపిస్తాడో..:

ఎవరి సంగతెలా ఉన్నా.. మహేష్‌తో మూవీ గనుక ఫిక్స్ అయితే ఈసారి సందీప్ వంగా ఎటువంటి కథతో వస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

'అర్జున్ రెడ్డి'లో విజయ్ క్యారెక్టర్‌ను అద్భుతంగా మలిచిన సందీప్.. మహేష్‌ను కూడా మునుపెన్నడూ చూడని యాంగిల్‌లో ప్రెజెంట్ చేస్తాడా? అన్నది చూడాలి. ఇప్పటికైతే వీరిద్దరి కాంబినేషన్‌పై ఎటువంటి క్లారిటీ లేదు కాబట్టి మున్ముందు ఆ వివరాలేమైనా తెలుస్తాయేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X