మెగాస్టార్‌పై కన్నేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. కథ రెడీ చేసి!

విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగా సృష్టించిన హంగామా అంతాఇంతా కాదు. తెలుగు సినిమాల్లో సరికొత్త ఒరవడికి తెరలేపుతూ లిప్‌లాక్స్ టేస్ట్ చూపించాడు సందీప్. ఆ తరువాత అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి ఆ టేస్ట్ బాలీవుడ్ ప్రేక్షకులకూ చూపించాడు. దీంతో ఉత్తరాది, దక్షిణాది లోనూ సందీప్ క్రేజ్ అమాంతం పెరిగింది.

సందీప్ రెడ్డి వంగా అప్ కమింగ్ మూవీస్ గురించిన ఎన్నో విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పటికే ఆయన తన రెండో సినిమాను బాలీవుడ్ లో కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. హిందీలో 'కబీర్ సింగ్' సినిమాను నిర్మించిన టీ సిరీస్ భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని నిర్మాతలుగా తన కొత్త ప్రాజెక్ట్ ఉండనుందని తెలిపాడు సందీప్ రెడ్డి వంగా. ఇంటెన్స్ క్రైమ్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపాడు.

Sandeep Reddy Vangas Next Project With Chiranjeevi..?

దీంతో ఆయన రెండో సినిమా విషయమై జరుగుతున్న చర్చలకు ఫుల్‌స్టాప్ పడింది. బాలీవుడ్ సంగతి సరే.. మరి టాలీవుడ్ ఆయన తదుపరి సినిమా ఏంటనే దానిపై ఓ ఆసక్తికర అప్‌డేట్ తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ విలక్షణ కథను సిద్ధం చేశారనే టాక్ నడుస్తోంది. అతి త్వరలో ఇది మెగాస్టార్‌కి వినిపించడానికి కూడా ఆయన రెడీ అయినట్లుగా సమాచారం. మరోవైపు సందీప్.. మహేష్ బాబుతో, విజయ్ దేవరకొండతో కూడా సినిమాలు చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి.. ఈ ముగ్గురిలో ఎవరితో సందీప్ ప్రయాణం ముందుగా మొదలు కానుందో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X