సందీప్ రెడ్డి వంగాకు షాక్ ఇచ్చిన త్రిప్తి డిమ్రీ.. రెమ్యునరేషన్ విషయంలో ట్విస్ట్?
సందీప్ రెడ్డి వంగ ఏది చేసినా సెన్సేషనే. టాలీవుడ్ లో మరో డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారాయన. అర్జున్ రెడ్డి మొదలు ఆయన ప్రతి సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉంటున్నాయి. చివరిగా వచ్చిన రెండు చిత్రాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ నెక్ట్స్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి సినిమా చేస్తున్న సంగతి అందరికీ విధితమే. తాజాగా హీరోయిన్ ను కూడా ప్రకటించారు. అయితే స్పిరిట్ హీరోయిన్ రెమ్యునరేషన్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గ్గా మారింది.. ఆ వివరాల్లోకి వెళితే..
స్పిరిట్ మూవీ హీరోయిన్ ఛేంజ్..
డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చిత్రాల్లో నటించేందుకు హీరోయిన్లు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తారు. ఎందుకంటే ఆయనకున్న సక్సెస్ రేట్ అలాంటింది. ఆయన చిత్రాల్లో నటించిన నటీనటులకు కెరీయర్ లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అన్నట్టుగా ఫలితాలు ఉంటాయి. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకోవాల్సిన స్పిరిట్ చిత్రంలో మొదటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ దీపికా పదుకొణె సెట్ కాకపోవడంతో వెంటనే యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని పాన్ వరల్డ్ భాషల్లో స్పిరిట్ హీరోయిన్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపికా రెమ్యునరేషన్, వర్కింగ్ స్టైల్, ప్రవర్తన నచ్చక సందీప్ రెడ్డి వంగానే రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

త్రిప్తి డిమ్రీ డెడికేషన్..
సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే త్రిప్తి డిమ్రీకి యానిమల్ చిత్రంలో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక స్పిరిట్ లోనూ అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ ఇవ్వడంతో ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే దీపికా పదుకొణె కంటే త్రిప్తి డిమ్రీ చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడంతో స్పిరిట్ మేకర్స్ కు బడ్జెట్ కలిసి వచ్చింది. అయితే త్రిప్తి డిమ్రీ ఏడాది కిందనే ప్రభాస్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తే బాగుండని, కానీ ఆ అవకాశం 1 శాతం కూడా ఉండబోదని పాత ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక స్పిరిట్ తో ఆ అవకాశం రావడంతో ఏకంగా పారితోషికం ఇవ్వకపోయినా ప్రభాస్ తో నటిస్తానని, తనకు డబ్బు కంటే ఇమేజ్ ముఖ్యమని సందీప్ తో చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు త్రిప్తి డిమ్రీ డెడికేషన్ కు సందీప్ రెడ్డి వంగ ఆశ్చర్యపోయారని కూడా అంటున్నారు.
త్రిప్తి డిమ్రీ తీసుకుంటున్న రెమ్యునరేషన్..
త్రిప్తి డిమ్రీ యానిమల్ తర్వాత ఒక్కో సినిమాకు రూ.30 నుంచి 40 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. కానీ స్పిరిట్ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా ఏకంగా రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందించారంట. అంతేకాదు.. సందీప్ పెట్టిన కండీషన్స్ తెలుగు నేర్చుకోవడం, 2 గంటలు ఎక్కువ పనిచేయడం విషయంలోనూ అంగీకారం తెలిపిందంట.
స్పిరిట్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం..
స్పిరిట్ మూవీ షూటింగ్ కు సందీప్ రెడ్డి వంగ అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే ఇటలీలో కొన్ని షూటింగ్ లోకేషన్లను లాక్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతున్నారని అంటున్నారు. ఏకధాటిగా 6 నెలల పాటు షూటింగ్ చేయనున్నానరని సమాచారం. 2026లో ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రూ.400 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది.


Click it and Unblock the Notifications











