కింగ్డమ్ టీమ్ కు మైండ్ బ్లాక్.. సెన్సార్ పై సందీప్ రెడ్డి వంగ ప్రిడిక్షన్ చూశారా?
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2017లో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అర్జున్ రెడ్డి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంతోనే టాలీవుడ్ లోనే కాకుండా, కోలీవుడ్, బాలీవుడ్ లోనూ సందీప్ రెడ్డి వంగ సెన్సేషన్ గా మారారు. కబీర్ సింగ్, యానిమల్ వంటి చిత్రాల తర్వాత సందీప్ రెడ్డి వంగ ఇండియాస్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నారు. అయితే తాజాగా సందీప్ రెడ్డి వంగ తన ఫస్ట్ హీరో విజయ్ దేవరకొండ రాబోయే చిత్రం కింగ్డమ్ ప్రమోషన్స్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా సెన్సార్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
కింగ్డమ్ ప్రమోషన్స్ షురూ..
చివరిగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రం ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక నెక్ట్స్ తన నుంచి రాబోతున్న చిత్రం కింగ్డమ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ అందుకుంటారని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కింగ్డమ్ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను షురూ చేశారు. నిర్మాత నాగ వంశీ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూనే వస్తున్నారు. మరోవైపు టీమ్ సాలిడ్ అప్డేట్స్ ను అందిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా విజయ్ దేవకొండ కూడా ప్రమోషన్స్ ను ప్రారంభించడం విశేషం.

సందీప్ రెడ్డి వంగ ప్రిడిక్షన్..
కింగ్డమ్ చిత్రం ప్రమోషన్స్ సందర్భంగా తొలిసారిగా సందీప్ రెడ్డి వంగతో చిట్ చాట్ నిర్వహించే వీడియోను వదులుతూ విజయ్ తన సైడ్ ప్రచార కార్యక్రమాన్ని షురూ చేశారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ సినిమాపై మంచి రివ్యూ ఇచ్చారు. తను 40 నిమిషాల పాటు సినిమా చూశానని చెప్పారు. విజయ్ లుక్, శ్రీలంక జైలు ఎపిసోడ్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయని అన్నారు. ఇక ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ వస్తుందని రెండ్రోజుల ముందే అంచనా వేశారు.
ఇక మేకర్స్ తాజాగా ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ తో సెన్సార్ రివ్యూ జరిగిందని ప్రకటించారు. జస్ట్ రష్ కట్ చూసి సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ను అంచనా వేయడంతో సందీప్ రెడ్డి వంగ విశ్లేషణకు అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా, సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.
సెన్సార్ సర్టిఫికెట్.. బాక్సాఫీస్ ఎఫెక్ట్..
ఇక ఈ చిత్రంలో పుల్ వయలెన్స్ ఉంటుందని విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి చెప్పుకొచ్చారు. వయలెన్స్, బ్లడ్ బాగా ఉంటుందని, అదంతా సెకండ్ హాఫ్ లో ఉంటుదని చెప్పుకొచ్చారు. దాంతో సందీప్ రెడ్డి వంగ స్పందిస్తూ వయలెన్స్ పెద్దగా సినిమాను ఎఫెక్ట్ చేయకపోయినా A సర్టిఫికెట్ వస్తే మాత్రం కష్టమని అన్నారు. తన సినిమాలకు A సర్టిఫికెట్ అందడం వల్ల బాక్సాఫీస్ వద్ద కాస్తా నష్టం జరిగిందని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది.


Click it and Unblock the Notifications











