Devara: వైల్డ్ డైరెక్టర్‌తో జూనియర్ ఎన్టీఆర్.. పాన్ ఇండియా షేక్ అయ్యేలా ప్లాన్

సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తనదైన మార్కును చూపిస్తూ.. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. 'టెంపర్' నుంచి మొదలుకొని వరుసగా ఆరు విజయాలను అందుకున్న అతడు.. తన మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈ ఊపులోనే వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' అనే సినిమాను చేస్తున్నాడు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ సముద్రపు నేపథ్యంతో రాబోతుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశం అంత ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగానే ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అలాగే, దీన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు.

Sandeep Reddy Vanga Special Interview With Jr NTR For Devara Movie

గతంలో ఎన్నడూ చూడని వైల్డ్ కాన్సెప్టుతో రాబోతున్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లను జరుపుకుంటూ వచ్చారు. ఇలా మొదటి పార్టుకు సంబంధించి ఇప్పటికే టాకీ పార్టును పూర్తి చేసేశారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా శరవేగంగా జరుపుతూనే ఉన్నారు.

జనతా గ్యారేజ్ తర్వాత మరో హిట్ కోసం ఎన్టీఆర్ - కొరటాల శివ చేసిన 'దేవర' మూవీ మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీ ప్రమోషన్‌ను కూడా ప్రారంభించేశారు. ఇలా ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడు పాటలను విడుదల చేశారు. అలాగే, 10వ తేదీన ట్రైలర్‌ను వదలబోతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ లీకైంది.

Sandeep Reddy Vanga Special Interview With Jr NTR For Devara Movie

'దేవర' మూవీ ప్రమోషన్స్ భారీ లెవెల్‌లో ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ ఇప్పటికే ముంబై వెళ్లి అక్కడ చాలా మంది సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతోనూ ఎన్టీఆర్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాడట. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ షూట్ జరగబోతుందని తెలిసింది. అందుకే సోమవారం వీళ్లిద్దరూ కలుసుకున్నారని తెలిసింది. ఇదే నిజం అయితే పాన్ ఇండియా షేక్ అవడం ఖాయం అని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Read more about: devara jr ntr sandeep reddy vanga
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X