Sandeep Reddy Vanga ఒక్క సినిమాతోనే ఊహించని క్రేజ్.. బన్నీ, ప్రభాస్ అలాగే మరో ఇద్దరు స్టార్స్!
ఎక్కడో విదేశాలకు వెళ్లి డైరెక్షన్ కోర్సు నేర్చుకుని 2017లో అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా తెరకెక్కిన రా అండ్ రస్టిక్ లవ్ ఇంటెన్స్ స్టోరీ యూత్ కి బాగా కనెక్ట్ అయి భారీ విజయం సాధించడంతో 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా 20 కోట్లు కలెక్షన్లు రాబట్టి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అందరూ సందీప్ రెడ్డి ఎలాంటి సినిమా తీస్తాడో అని వెయిట్ చేశారు.
కానీ బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో సందీప్ రెడ్డి అక్కడ అర్జున్ రెడ్డి సినిమాని కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కించగా అది కూడా మంచి విజయం సాధించింది. దీంతో సందీప్ రెడ్డి పేరు బాలీవుడ్ లో కూడా మారు మ్రోగిపోయింది. ఈ సినిమాని భూషణ్ కుమార్ నిర్మాణంలో బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ నిర్మించగా ఈ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థ సందీప్ వంగతో మరో నాలుగు భారీ సినిమాలు చేసే ఛాన్స్ ఇచ్చింది.

ప్రస్తుతం సందీప్ రెడ్డి బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తో ఓ సినిమా ప్రకటించాడు. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన సందీప్ వంగ ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలతో బాలీవుడ్ లో సినిమాలు తెరకెక్కిస్తూ తెలుగు హీరోలను కూడా పట్టేసినట్టు అయింది.
ఇక ఈరోజు అల్లు అర్జున్ 23వ సినిమా ప్రకటించగా అది పూర్తవగానే విజయ్ దేవరకొండలో మరో సినిమా ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద ఒకే ఒక్క సినిమా హిట్టు కొట్టు ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు ఈ డైరెక్టర్.


Click it and Unblock the Notifications











