Just In
- 31 min ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
- 37 min ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 58 min ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
- 1 hr ago
రజనీకాంత్ మరో షాక్ ఇవ్వబోతున్నారా?.. సినిమాలను ఆపేసిన తలైవా.. ఆ దర్శకుడి తీరుతో అనుమానాలు
Don't Miss!
- News
దారుణం.. దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టారు... షాకింగ్ వీడియో..
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Sports
IPL 2021లో అత్యధిక ధర అతనికే.. ఎవరూ ఊహించరు కూడా!!
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరోసారి విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి వంగా.. అర్జున్ రెడ్డి కంటే డబుల్ డోస్!!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్‌ని మలుపుతిప్పింది అర్జున్ రెడ్డి మూవీ. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ మాస్ అప్పీయరెన్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు అదే డైరెక్టర్‌తో మన రౌడీ స్టార్ మరో మూవీ చేయబోతున్నాడనే సమాచారం బయటకొచ్చింది. అప్పటికంటే డబుల్ డోస్ ఇస్తూ ప్రేక్షకుల ముందుకు రానుందట ఈ కాంబో.

అర్జున్ రెడ్డి సెన్సేషన్.. గాడిలో పడ్డ హీరో
టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తూ విజయ్ దేవరకొండ కెరీర్‌ని గాడిలో పెట్టింది అర్జున్ రెడ్డి మూవీ. ఈ సినిమా తర్వాత వరుసగా గీత గోవిందం, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలు చేసి యూత్ ఆడియన్స్ లో క్రేజీ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ.

డీలాపడ్డ వరల్డ్ ఫేమస్ లవర్.. లైన్ లోకి సందీప్ రెడ్డి
ఇక ఇటీవలే వచ్చిన విజయ్ దేవరకొండ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్' ఆశించిన మేర ఫలితం రాబట్టలేకపోయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టడంలో డీలా పడింది. సరిగ్గా ఈ తరుణంలో మరోసారి సందీప్ రెడ్డి వంగా పేరు లైన్ లోకి రావడం ఆయన అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతోంది.

పక్కా క్రైమ్ డ్రామా.. హ్యాండిచ్చిన బాలీవుడ్ హీరో
ఇటీవలే బాలీవుడ్ లో కబీర్ సింగ్‌తో హిట్ పట్టేసిన సందీప్ రెడ్డి వంగా.. తన తదుపరి సినిమాను కూడా బాలీవుడ్ లోనే చేయాలనుకున్నాడు. ఈ మేరకు సూపర్ స్టార్ రణ్ బీర్ కపూర్‌తో పక్కా క్రైమ్ డ్రామా రూపొందించాలని ఫిక్స్ అయ్యాడు. అసలైన క్రైమ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ఈ చిత్రంతో చూపిస్తానని ఛాలెంజ్ కూడా చేశాడు సందీప్ రెడ్డి వంగా. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రణ్ బీర్ కపూర్ ఈ సినిమా చేయనని చెప్పాడు.

ఎప్పుడూ సిద్ధమే.. విజయ్ స్టేట్‌మెంట్
దీంతో ఇదే స్క్రిప్ట్‌ని విజయ్ దేవరకొండతో చేయాలని చూస్తున్నాడట సందీప్. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ స్క్రిప్ట్‌లో విజయ్ బాగా సూట్ అవుతాడని భావించి, ఆయనతో ఈ క్రైమ్ డ్రామా చేయాలని భావిస్తున్నారట సందీప్. మరోవైపు తన కెరీర్‌లో అతిపెద్ద బ్రేక్ ఇచ్చిన సందీప్‌తో కలిసి పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధమే ఇప్పటికే విజయ్ దేవరకొండ చెప్పాడు కూడా. పైగా ఇప్పుడు కెరీర్ డైలమాలో ఉంది కాబట్టి ఈ మూవీకి విజయ్ ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువ.


ఫైటర్‌గా విజయ్..
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తికాగానే శివ నిర్వాణతో విజయ్ సినిమా చేయాల్సి ఉంది. కానీ శివ కూడా టక్ జగదీష్ తో బిజీగా ఉన్నాడు కాబట్టి ఈ లోగా సందీప్‌తో విజయ్ సినిమా పూర్తిచేస్తాడని టాక్.