twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ.ఎన్టీఆర్‌తో హింస, ప్రేమ.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ క్రేజీ ప్లానింగ్!

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న గత ఏడాది అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో మెమొరబుల్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యాక్షన్ కథకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి ట్రిపుల్ ఆర్ చిత్రంతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇది తెలుగు సినిమా చరిత్రలోనే భారీ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ నుంచి మరో ఏడాది వరకు సోలో చిత్రాన్ని ఆశించలేం. తాజాగా ఎన్టీఆర్ తదుపరి చిత్రాల గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

    మాస్ ఫాలోయింగ్

    మాస్ ఫాలోయింగ్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ తన కెరీర్ లో మాస్ యాక్షన్ చిత్రాలు, కుటుంబ కథలే ఎక్కువగా చేశాడు. ఎన్టీఆర్ నుంచి వచ్చిన ప్రేమ కథాచిత్రాలు చాలా తక్కువ. కెరీర్ లో తొలిసారి ఎన్టీఆర్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్రేజీ దర్శకుడు ఎన్టీఆర్ కోసం ప్రేమ కథని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఎన్టీఆర్‌తో హింస, ప్రేమ

    ఎన్టీఆర్‌తో హింస, ప్రేమ

    అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడు సందీప్ వంగ సెన్సేషన్ గా మారిపోయాడు. ఇంటెన్స్ తో కూడుకున్న ప్రేమ కథ, బోల్డ్ కంటెంట్ తో అర్జున్ రెడ్డి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో సందీప్ బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారాడు. ఇదిలా ఉండగా సందీప్ ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం హింసతో కూడుకున్న ప్రేమ కథని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    పార్టీలో కలసి

    పార్టీలో కలసి

    రాంచరణ్, ఎన్టీఆర్ ఇటీవల ఓ పార్టీలో కలసి ఉన్న సందర్భంగా సందీప్ ఎన్టీఆర్ ఈ ప్రతిపాదన వినిపించినట్లు తెలుస్తోంది. త్వరలోనే పూర్తి కథ వింటానని ఎన్టీఆర్ సందీప్ కు హామీ ఇచ్చాడట. ఈ ప్రాజెక్ట్ ఒకే అయినా ఎప్పుడు మొదలవుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం సందీప్ వంగ హిందీలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరో ఏడాది వరకు బిజీగా ఉంటాడు.

    మహేష్ బాబుతో

    మహేష్ బాబుతో

    సందీప్ వంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఓ చిత్రానికి కమిటై ఉన్నాడు. మహర్షి తర్వాత మహేష్ సుకుమార్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. సందీప్ వంగకు స్టార్ హీరోలు అవకాశాలు ఇస్తున్నా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

    English summary
    Sandeep Vanga to direct Jr NTR with love story
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X