twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో వేశ్యగా మారిన యాక్టర్ సంగీతా...

    By Sindhu
    |

    సాదారణంగా హీరోయిన్లు పోషించాలనుకునే పాత్రలు కొన్ని వుంటాయి. వాటిలో ఒకటి వేశ్య పాత్ర! ఆ క్యారెక్టర్ లో నటిస్తే తమలోని అసలైన నటి బయటకు వస్తుందని వాళ్ల నమ్మకం. ఆమధ్య అనుష్క కూడా అలాగే 'వేదం' సినిమాలో ఆ టైపు క్యారెక్టర్ చేసి మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు మరో నటి సంగీత కూడా ఓ సినిమాలో వేశ్యగా యాక్ట్ చేసింది.

    పెళ్లి చేసుకొని హాయిగా సంసార జీవితాన్ని గడుపుతున్న సంగీత వేశ్యగా మారడం ఏమిటి?అనే సందేహంలో పడ్డారా..అయితే పప్పులో కాలువేసినట్టే..మరి ఎందుకంటే తమిళంలో 'ధనం" అనే చిత్రం కోసమే..పక్కా మాస్ తరహాలో సాగే ఈ పాత్ర సంగీతకు మంచి పేరే తెచ్చిందట.ఇప్పుడీ సినిమాని అదే పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు అడ్డాల వెంకట్రావు. శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తెలుగు ఆర్టిస్టులు ఎక్కువ మంది యాక్ట్ చేయడం ఓ విశేషమైతే, సినిమా షూటింగ్ హైదరాబాదులో జరగడం మరో విశేషం! కాగా సంగీత 'శివపుత్రుడు"లో డీగ్లామర్ రోల్ తో పాటు 'ఖడ్గం"లో సినిమా ఛాన్స్ కోసం అడ్డదారిలో పయనించిన యువతిగా నటించిన సంగీత..ఈ వేశ్య పాత్రలో ఎంతవరకు అలరించనుందో..తెలియాలంటే ధనం చిత్రం విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే...

    English summary
    Dhanam with Sangeetha in the lead is nearing completion. Sangeetha plays a meaty role in the movie, which is said to revolve around the life of a commercial sex worker played by her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X